తెలంగాణకు నేనే హీరో: రేవంత్ రెడ్డి

కలం, వెబ్ డెస్క్ : దక్షిణాది రాష్ట్రాలపై ప్రధాన మంత్రి నరేంద్ర మోదీకి (PM Modi) చిన్నచూపు ఉందని సీఎం రేవంత్ రెడ్డి (Revanth Reddy) సంచలన ఆరోపనలు చేశారు. కేంద్ర ప్రభుత్వంలోని కీలక శాఖలు ఒక్కటి కూడా దక్షిణాది రాష్ట్రాల వారికి ఇవ్వలేదన్నారు. కేవలం ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ తప్ప.. వేరే వారికి టాప్-10లోని కీలక శాఖలు ఇవ్వలేదని విమర్శించారు. కాంగ్రెస్ హయాంలో దక్షిణాది రాష్ట్రాల నుంచి రాష్ట్రపతి పదవులు పొందిన వారు ఉన్నారని.. కానీ బీజేపీలో అలాంటి పరిస్థితి కనిపించట్లేదన్నారు. తాజాగా ఓ టీవీ ప్రోగ్రామ్ లో పాల్గొన్న సీఎం రేవంత్ రెడ్డి అనేక విషయాలపై స్పందించారు.

తెలంగాణకు నేనే హీరో: రేవంత్ రెడ్డి

తెలంగాణలో ఉన్న విలన్ల వల్లే తనను ప్రజలు హీరోగా చూశారని సీఎం రేవంత్ చెప్పుకొచ్చారు. తెలంగాణలో ఇంకా 8 ఏళ్లు కాంగ్రెస్ అధికారంలో ఉంటుందని ధీమా వ్యక్తం చేశారు. తెలంగాణను ఐకాన్ గా తీర్చిదిద్దాలన్నదే తన లక్ష్యం అని తేల్చి చెప్పారు. ఆ విషయంలో ఎవరితో అయినా పోరాడుతానని చెప్పారు. తెలంగాణలో తమ ప్రభుత్వం పట్ల అందరిలోనూ సంతృప్తి ఉందన్నారు. తాను కార్యకర్తల ఫ్రెండ్ అని.. కార్యకర్తలు తనను ఇష్టపడుతారని సీఎం రేవంత్ వెల్లడించారు.

డీలిమిటేషన్ కు తాము వ్యతిరేకం కాదని.. కానీ వివక్ష చూపిస్తే కచ్చితంగా గళం విప్పుతానని చెప్పారు సీఎం రేవంత్. డీలిమిటేషన్ విషయంలో దక్షిణాదికి బీజేపీ అన్యాయం చేయాలని చూస్తోందని.. ఈ విషయంపై సౌత్ రాష్ట్రాలు ఏకం కావాలని సీఎం రేవంత్ పిలుపునిచ్చారు. ఏ లెక్క ప్రకారం 50 శాతం సీట్ల పెంపును చేపడుతున్నారని సీఎం రేవంత్ ప్రశ్నించారు. జనాభా ప్రాతిపదికన డీలిమిటేషన్ చేపడితే.. యూపీలో 160 ఎంపీ సీట్లు అవుతాయని సీఎం రేవంత్ చెప్పుకొచ్చారు. అదే సమయంలో కేరళలో 60 సీట్లే అవుతాయని.. ఈ లెక్కన ఉత్తరాది రాష్ట్రాలతో బీజేపీ అధికారంలోకి రావాలని చూస్తోందన్నారు. సీట్ల పెంపుపై చర్చ జరగాలని రేవంత్ (Revanth Reddy) చెప్పారు.

Read Also: మావోయిస్టులకు భారీ దెబ్బ.. మోస్ట్‌ వాంటెడ్‌ మావోయిస్టు పాపారావు లొంగుబాటు!

Follow Us On: Instagram

 

 

 

 

 

 

 

 

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>