ఎయిర్‌ఫోర్స్ వింగ్ కమాండర్ అరెస్ట్.. ఏం చేశాడో తెలుసా!

కలం, వెబ్ డెస్క్: ఎయిర్‌ఫోర్స్‌లో వింగ్ కమాండర్‌ (Wing Commander)గా పనిచేస్తున్న అధికారి పాకిస్థాన్ మహిళ వేసిన హనీ ట్రాప్‌లో పడిపోయాడు. ఆమెకు దేశ రహస్యాలను చేరవేస్తున్నట్లు గుర్తించిన ఢిల్లీ పోలీసులు వెంటనే అరెస్ట్ చేసి, కోర్టులో ప్రవేశ పెట్టారు. భద్రతా కారణాల రీత్యా ఆయన పేరును వెల్లడించలేదు. ఎయిర్‌ఫోర్స్‌లో అత్యంత కీలకమైన ప్రదేశంలో పనిచేస్తున్న ఆయనకు సోషల్ మీడియాలో ఓ మహిళ పరిచయమైంది. స్నేహం, ఆ తరువాత ప్రేమిస్తున్నట్లు నటించడంతో వింగ్ కమాండర్ పూర్తిగా ఆమెను నమ్మేశాడు. తరచూ వీడియో కాల్స్ చేస్తూ.. ఆయన్ను పూర్తిగా లొంగదీసుకుంది.

సైన్యం ఫొటోలు కావాలని..

వింగ్ కమాండర్ తాను చెప్పినట్లు వినడం ప్రారంభించడంతో తనకు సైనికుల కదలికలు, ఆర్మీ కార్యాలయాల ఫొటోలు కావాలని కోరింది. దీంతో ఆయన రహస్యంగా వాటిని సేకరిస్తూ.. వివిధ మార్గాల్లో పంపిస్తున్నారు. దేశ భద్రతకు సంబంధించిన కొన్ని రహస్య పత్రాలు, డిజిటల్ రికార్డులను కూడా సోషల్ మీడియా ద్వారా సదరు మహిళకు పంపించినట్లు ఢిల్లీ పోలీసులు వివరించారు. ఇటీవల ఇంజెలిజెన్స్ విభాగం ఆయన వ్యవహారాలపై మరింత ఫోకస్ పెట్టడంతో హనీ ట్రాప్ విషయం వెలుగులోకి వచ్చింది. పాకిస్థాన్ ఐఎస్ఐకి చెందిన మహిళే.. వింగ్ కమాండర్‌ను ట్రాప్ చేసినట్లు స్పష్టమైన ఆధారాలు లభించాయి. ఈ ఘటనపై ఎయిర్‌ఫోర్స్ సైతం అంతర్గత విచారణకు ఆదేశించింది.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>