కలం, వెబ్ డెస్క్ : వైసీపీ చేపట్టిన రిలే దీక్షలపై ఆంధ్రప్రదేశ సీఎం చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) కీలక వ్యాఖ్యలు చేశారు. చట్టానికి వ్యతిరేకంగా వ్యవహరిస్తే ప్రభుత్వం అంగీకరించబోమని వైసీపీ నేతలను ఉద్దేశించి పరోక్షంగా హెచ్చరికలు జారీ చేశారు. శనివారం అమరావతి టీడీపీ కేంద్ర కార్యాలయంలో ఆయన మీడియాతో చిట్ చాట్ చేశారు.
ప్రజలను ఇబ్బందులకు గురిచేసే విధంగా నిరసన కార్యక్రమాలను చేపట్టడాన్ని సహించే ప్రసక్తే లేదని చంద్రబాబు నాయుడు తేల్చి చెప్పారు. బస్టాండ్లు, రహదారులపై నిరసనలు చేపడితే ఊరుకునేదన్నారు. వైసీపీ నిర్వహిస్తున్న రిలే దీక్షల్లో పాల్గొన్నవారందరూ రౌడీలే అని.. ఒక్క డీఎస్సీ అభ్యర్థి కూడా లేరని ఆరోపించారు.
కర్నూలులో నిరసన చేపట్టిన వారంతా డీఎస్సీ ద్వారా ఉద్యోగాలకు ఎంపికైన వారే అని వెల్లడించారు. ‘గొడ్డలి పార్టీ’ చేసిన నష్టం కారణంగానే ఉపాధ్యాయులు తమ ఆత్మగౌరవాన్ని చాటుకున్నారని సీఎం చంద్రబాబు చెప్పారు.

