హైదరాబాద్ లో భారీ వర్షం.. అలర్ట్

కలం, వెబ్ డెస్క్: హైదరాబాద్ లో ప్రస్తుతం విభిన్నమైన వాతావరణ పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఎండాకాలంలోనూ హైదరాబాద్ నగర వాసులను వర్షపు జల్లులు పలకరిస్తున్నాయి. హైదరాబాద్ (HYD) లోని పలు చోట్ల భారీ వర్షం (Heavy Rain) కురుస్తోంది. పంజాగుట్ట, అమీర్ పేట్, మియాపూర్,కూకట్‌పల్లి, బోరబండ, కేపీహెచ్‌బీ, జేఎన్టీయూ, నిజాంపేట్‌, మూసాపేట్, చందానగర్, సూరారం, కొంపల్లి, దుండిగల్, జగద్గిరిగుట్ట, చింతల్‌ తో పాటు ఇతర ప్రాంతాల్లోనూ భారీ వర్షం కురుస్తోంది. వర్షానికి నిజాంపేట్ రోడ్లు జలమయ్యాం అయ్యాయి. ఆఫీస్ నుంచి ఇంటికి వెళ్లే సమయం కావడంతో పలు చోట్ల భారీగా ట్రాఫిక్ జామ్ అయ్యింది. వాహనదారులు ఇబ్బందిపడుతున్నారు.

ఈ జిల్లాలకు ఎల్లో అలర్ట్

వాతావరణ శాఖ వివరాల ప్రకారం.. ఉపరితల ఆవర్తనం, ద్రోణి ప్రభావం కారణంగా తెలంగాణలో రాబోయే మూడు రోజుల పాటు వర్షాలు పడే అవకాశముంది. ఆదిలాబాద్, కొమురంభీం ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల, పెద్దపల్లి, వరంగల్, హనుమకొండ, సిద్దిపేట, వికారాబాద్, సంగారెడ్డి, మెదక్, కామారెడ్డి జిల్లాల్లో గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీస్తూ ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని ఈ ప్రాంతాలకు వాతావరణ శాఖ అధికారులు ఎల్లో అలర్ట్ జారీ చేశారు. ఆదిలాబాద్ నుంచి రంగారెడ్డి వరకు పలు జిల్లాల్లో వర్షాలు, ఈదురుగాలులు ప్రభావం చూపవచ్చని తెలిపారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, బహిరంగ ప్రదేశాల్లో ఉండకుండా జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులు సూచిస్తున్నారు.

Read Also: ఇందిరమ్మ ఇండ్ల లబ్ధిదారులకు గుడ్‌న్యూస్.. 48.79 కోట్ల నిధులు రిలీజ్

Follow Us On: X(Twitter)

 

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>