ఆష్లి గార్డనర్ వైస్ కెప్టెన్సీకి ముప్పు.. భార్య సంచలన వ్యాఖ్యలు

కలం, స్పోర్ట్స్: ఆస్ట్రేలియా ఉమెన్స్ క్రికెట్‌లో తీవ్ర దుమారం రేగుతోంది. ఆల్ రౌండర్ ఆష్లి గార్డనర్ (Ashleigh Gardner) వైస్ కెప్టెన్సీకి గండం పొంచి ఉందనే వార్తలు వస్తున్నాయి. సొంత భార్య మోనికా రైట్ (Monica Wright) చేసిన సంచలన ఆరోపణలే దీనికి కారణం. గార్డనర్‌ను వెంటనే నాయకత్వ బాధ్యతల నుంచి తీసేయాలని మోనికా డిమాండ్ చేశారు.

తన భార్య గార్డనర్.. జూనియర్ ప్లేయర్ జార్జియా వోల్‌తో అక్రమ సంబంధం పెట్టుకుందని జూలైలోనే మోనికా ఇన్‌స్టాగ్రామ్‌లో బాంబు పేల్చారు. ఆ తర్వాత ఇద్దరూ విడిపోయారు. తాజాగా ఒక ఇంటర్వ్యూలో మాట్లాడిన మోనికా.. క్రికెట్ ఆస్ట్రేలియా మౌనంపై నిప్పులు చెరిగారు. దేశానికి ఆడే ఆటగాళ్లు కట్టుబాట్లతో ఉండాలని ఘాటుగా వ్యాఖ్యానించారు.

జూనియర్ ప్లేయర్‌తో సంబంధాలు పెట్టుకుని, నాయకత్వ హోదాలో ఎలా కొనసాగుతారని ప్రశ్నించారు. బోర్డు మాత్రం ఇది వారి సొంత విషయమని తేల్చేసింది. మరోవైపు సిడ్నీ సిక్సర్స్ మేనేజ్‌మెంట్ మాత్రం గార్డనర్‌‌కు అండగా నిలిచింది. ఆమెనే తమ కెప్టెన్‌గా కొనసాగిస్తామని ప్రకటించింది. ఇటీవల T20 వరల్డ్ కప్ గెలిచిన ఆస్ట్రేలియా జట్టులో గార్డనర్ వైస్ కెప్టెన్‌గా ఉన్నారు. ఈ రచ్చపై గార్డనర్, వోల్ ఇద్దరూ ఇప్పటికీ నోరు విప్పలేదు. ఇప్పుడు ప్రైవేట్ లైఫ్, టీమ్ రూల్స్ మధ్య ఆస్ట్రేలియా బోర్డు ఏం చేయాలో పాలుపోక సతమతమవుతోంది.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>