కవిత కొత్త పార్టీపై ఎమ్మెల్యే మేఘారెడ్డి విమర్శలు

కలం, వెబ్‌డెస్క్: కవిత (Kavitha) కొత్త రాజకీయ పార్టీ ‘తెలంగాణ రాష్ట్ర సేన'(TRS) ను ప్రకటించిన వేళ ఎమ్మెల్యే మేఘారెడ్డి (MLA Megha Reddy) తీవ్ర విమర్శలు గుప్పించారు. బీఆర్ఎస్ హయాంలో అధికారంలో ఉన్నప్పుడు గుర్తుకురాని ప్రజలు ఇప్పుడు ఎందుకు గుర్తుకు వచ్చారు అని ప్రశ్నించారు. ధనిక తెలంగాణను అప్పుల ఊబిలోకి నెట్టేసినప్పుడు ప్రజలు గుర్తుకు రాలేదా అని మండిపడ్డారు. ఆస్తుల కొట్లాటలో భాగంగానే కవిత కొత్త పార్టీని ఏర్పాటు చేసిందని ఎమ్మెల్యే ఆరోపించారు. కవిత పార్టీ వల్ల కాంగ్రెస్‌కు ఎటువంటి నష్టం లేదని ధీమా వ్యక్తం చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం బడుగు, బలహీన వర్గాల పక్షపాతి అని అన్నారు.

Read Also: మళ్లీ పుట్టిన ‘టీఆర్ఎస్’.. పేరు, జెండా వెనుక కవిత స్ట్రాటజీ ఏంటి?

Follow Us On: Instagram

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>