Mobile Popup Ad
Mobile Popup Ad

మొక్క‌జొన్న‌ కొనుగోళ్లు వేగవంతం చేయాలి: హనుమకొండ అదనపు కలెక్టర్ రవి

కలం, వరంగల్ బ్యూరో: మొక్క‌జొన్న‌ కొనుగోళ్లను మరింత వేగవంతం చేయాలని హనుమకొండ (Hanumakonda) జిల్లా అదనపు కలెక్టర్ ఎన్.రవి అన్నారు. శనివారం హనుమకొండ జిల్లా ఎల్కతుర్తి మండల కేంద్రంలో మొక్క‌జొన్న‌ కొనుగోలు కేంద్రాన్ని సందర్శించారు. కొనుగోలు కేంద్రానికి ఎంతమంది రైతులు తమ పంట ఉత్పత్తులను తెచ్చారని, ఇప్పటివరకు ఎంత కొనుగోలు చేశారని నిర్వాహకులను అదనపు కలెక్టర్ అడిగి తెలుసుకున్నారు.

విక్రయించేందుకు వచ్చిన రైతులతో అదనపు కలెక్టర్ మాట్లాడుతూ కొనుగోలు ప్రక్రియ సాఫీగా సాగాలని సూచించారు. సరిపడా గన్నీ సంచులు కొనుగోలు కేంద్రం వద్ద అందుబాటులో ఉండాలన్నారు. రైతుల నుంచి కొనుగోలు చేసిన వెంటనే లారీల ద్వారా గోదాముకు తరలించాలన్నారు. టార్పాలిన్ కవర్లు అందుబాటులో ఉండాలని పేర్కొన్నారు. రైతులకు ఇబ్బందులు కలగకూడదని సూచించారు. ఈ కార్యక్రమంలో ఎల్కతుర్తి వ్యవసాయ మార్కెట్ కమిటీ ఛైర్మన్ సంతాజీ, తహ‌సీల్దార్ ప్రసాదరావు, ఎంపీడీవో విజయ్ కుమార్, పీఎసీఎస్ సిబ్బంది పాల్గొన్నారు.

Read Also: మళ్లీ పుట్టిన ‘టీఆర్ఎస్’.. పేరు, జెండా వెనుక కవిత స్ట్రాటజీ ఏంటి?

Follow Us On: X(Twitter)

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>