Mobile Popup Ad
Mobile Popup Ad

కాలనీల అభివృద్ధికి రూ.3.66 కోట్ల నిధులు విడుదల: మహిపాల్ రెడ్డి

క‌లం, మెద‌క్ బ్యూరో: సంగారెడ్డి (Sangareddy) జిల్లా పటాన్ చెరువు నియోజకవర్గం ప‌రిధిలోని అమీన్ పూర్ (Ameenpur), బీరంగూడ (Beeramguda) డివిజన్లలోని వివిధ కాలనీలు, విలీన గ్రామాలలో రూ.3 కోట్ల 66 లక్షల రూపాయలతో చేపట్టనున్న వివిధ అభివృద్ధి పనులకు ఎమ్మెల్యే మహిపాల్ రెడ్డి (Mahipal Reddy) శంకుస్థాపనలు చేశారు. ఇటీవ‌లే GHMCలో విలీనం అయ్యి, శరవేగంగా అభివృద్ధి చెందుతున్న బీరంగూడ, అమీన్‌పూర్ డివిజన్ల పరిధిలోని కొత్త కాలనీలో మౌలిక వసతులైన రోడ్లు, డ్రైనేజి, క‌రెంటు స‌దుపాయం క‌ల్పించ‌డ‌మే ల‌క్ష్యంగా రూ.3.60 కోట్ల నిధుల‌తో పనులు ప్రారంభించడం సంతోషంగా ఉంద‌న్నారు.

కొత్త కాల‌నీల‌లో ప్రజా సమస్యలను ఎప్పటికప్పుడు తెలుసుకుంటూ వాటి పరిష్కారానికి ప్రణాళికాబద్ధంగా నిధులు కేటాయిస్తున్నట్లు ఎమ్మెల్యే (Mahipal Reddy) తెలిపారు. యూజీడి ప‌నుల‌ను వేగంగా పూర్తి చేసి స్థానిక స‌మ‌స్య‌ల‌ను ప‌రిష్కరించేందుకు పెద్దపీట వేస్తున్నామని అన్నారు. ఈ అభివృద్ధి కార్య‌క్ర‌మాల‌కు అమీన్ పూర్ మున్సిపల్ మాజీ ఛైర్మన్ తుమ్మల పాండురంగారెడ్డి, మున్సిపల్ మాజీ వైస్ చైర్మన్ నరసింహ గౌడ్, మాజీ ఎంపీపీ దేవానందం, మాజీ జెడ్పీటీసీ సుధాకర్ రెడ్డి పాల్గొన్నారు.

Read Also: తెలంగాణ కేబినెట్ శుభవార్త.. విద్యార్థులకు ఇక నుంచి టిఫిన్

Follow Us On : WhatsApp

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>