కలం, వెబ్ డెస్క్: సీఎం రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో భేటీ అయిన తెలంగాణ కేబినెట్ (Telangana Cabinet) కీలక నిర్ణయం తీసుకుంది. వచ్చే విద్యా సంవత్సరం నుంచి అన్ని ప్రభుత్వ పాఠశాలలతో పాటు జూనియర్ కాలేజీల్లో మధ్యాహ్న భోజన పథకం అమలు చేయబోతున్నారు. విద్యార్థులకు ఉదయం టిఫిన్, పాలు అందించాలని నిర్ణయించింది. తద్వారా, విద్యార్థులకు ఆహార సమస్య లేకుండా చేయడంతో పాటు డ్రాపౌట్స్ సంఖ్య తగ్గించవచ్చని భావిస్తోంది. గతంలోనే ముఖ్యమంత్రి స్వయంగా ఈ విషయాన్ని పేర్కొన్నా.. కేబినెట్ నిర్ణయంతో ఇక నుంచి అమల్లోకి రానుంది. హ్యామ్ రోడ్ల నిర్మాణానికి సంబంధించిన టెండర్లలో కీలక మార్పులపై చర్చ జరిగింది. ధాన్యం మొక్కజొన్న కొనుగోలు, రైతుల ఖాతాల్లో డబ్బుల జమపై సమీక్ష జరిపింది. ప్రస్తుతం కేబినెట్ సమావేశం ఇంకా కొనసాగుతోంది.
Read Also: ఆవును జాతీయ జంతువుగా ప్రకటించాలి: ఫరూఖ్ షిబ్లీ
Follow Us On: Instagram

