Mobile Popup Ad
Mobile Popup Ad

రోడ్డు భద్రత – ప్రతి ఒక్కరి బాధ్యత : ఎమ్మెల్యే కుంభం

కలం, భువనగిరి : రోడ్డు ప్రమాదాల నివారణకు ప్రతి పౌరుడు ట్రాఫిక్ నిబంధనలను బాధ్యతగా పాటించాలని భువనగిరి నియోజకవర్గ శాసనసభ్యులు కుంభం అనిల్ కుమార్ రెడ్డి (MLA Kumbham) పిలుపునిచ్చారు. భువనగిరి నియోజకవర్గంలోని పోచంపల్లి మండలం దేశముఖి గ్రామంలో నిర్వహించిన రోడ్డు భద్రత అవగాహన గ్రామసభ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఈ కార్యక్రమానికి తెలంగాణ రాష్ట్ర పోలీస్ అకాడమీ డైరెక్టర్ శ్రీమతి అభిలాష బిష్ట్ ముఖ్య అతిథిగా హాజరై, ప్రజలకు రోడ్డు భద్రతా నియమాలపై విస్తృత అవగాహన కల్పించారు.

ఈ సందర్భంగా ఎమ్మెల్యే కుంభం అనిల్ కుమార్ రెడ్డి (MLA Kumbham Anil Kumar Reddy) మాట్లాడుతూ.. ప్రమాదాలు జరిగిన తర్వాత బాధపడటం కంటే ముందస్తు జాగ్రత్తలు తీసుకోవడం ఎంతో ముఖ్యమన్నారు. దేశంలో, రాష్ట్రంలో జరుగుతున్న అత్యధిక ప్రమాదాలకు మానవ తప్పిదాలు, నిర్లక్ష్యమే ప్రధాన కారణాలని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ముఖ్యంగా యువత ర్యాష్ డ్రైవింగ్, అతివేగంతో ప్రాణాల మీదకు తెచ్చుకుంటున్నారని హెచ్చరించారు.

సభ అనంతరం ఎమ్మెల్యే కుంభం అనిల్ కుమార్ రెడ్డి, పోలీస్ అకాడమీ డైరెక్టర్ అభిలాష బిష్ట్ తో కలిసి స్థానిక యువకులకు ఉచితంగా హెల్మెట్లను పంపిణీ చేశారు. రోడ్డు భద్రతపై అవగాహన పెంపొందించేందుకు ఇలాంటి కార్యక్రమాలు చేపట్టడం అభినందనీయమని వారు పేర్కొన్నారు. ఈ సదస్సులో జిల్లా ఎస్పీ అక్షాంశ్ యాదవ్, స్థానిక ఆర్డీవో, సంబంధిత ప్రభుత్వ ఉన్నతాధికారులు, గ్రామ సర్పంచ్, ఇతర ప్రజాప్రతినిధులు, రాజకీయ నాయకులు పాల్గొన్నారు.

Read Also: ఫిఫా సంబురం.. గ్యాలరీలోనే భారతం

Follow Us On: Instagram

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>