మమతా బెనర్జీకి వరుస షాకులు… మరో నేత రాజీనామా

కలం, వెబ్ డెస్క్ : అధికారం కోల్పోయిన తర్వాత పశ్చిమ బెంగాల్ మాజీ సీఎం, టీఎంసీ అధినేత్రి మమతా బెనర్జీకి షాక్‌ల మీద షాక్‌లు తగుతున్నాయి. టీఎంసీ పార్టీ నేతలు ఒక్కొక్కరిగా పార్టీని వీడుతున్నారు. ఇప్పటికే సీనియర్ నేత సుఖేందు శేఖర్ రాయ్ ఇటీవల తృణమూల్ కాంగ్రెస్‌కు రాజీనామా చేయగా.. తాజాగా టీఎంసీ ఎంపీ (TMC MP) సుష్మితా దేవ్ సైతం రాజీనామా చేశారు. ఈ మేరకు పార్టీతో పాటు అన్ని పదవులకు రాజీనామా చేస్తున్నట్లు సుష్మితా దేవ్ ప్రకటించారు.

ఇప్పటికే అధికారం కోల్పోయిన వెంటనే తృణమూల్ కాంగ్రెస్‌లోని 58 మంది ఎమ్మెల్యేలు రెబల్స్ గా మారారు. లోక్ సభలో 20 మంది ఎంపీలు తమను ప్రత్యేక వర్గంగా చూడాలని లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లాకు లేఖ ఇచ్చారు. మరోవైపు పశ్చిమ బెంగాల్ లో సీఐడీ అధికారులు దాడులు నిర్వహిస్తున్నారు. ఏకకాలంలోనే టీఎంసీ కేంద్ర కార్యాలయం, పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి అభిషేక్ బెనర్జీ కార్యాలయంలో సోదాలు నిర్వహించారు. ఒకవైపు సొంత పార్టీలో అసమ్మతి రాగం, మరోవైపు సీఐడీ సోదాలతో టీఎంసీ పరిస్థితి దారుణంగా తయారయ్యింది. ఈ నేపథ్యంలో టీఎంసీ ఎంపీల వరుస రాజీనామాలు పశ్చిమ బెంగాల్ రాజకీయాల్లో తీవ్ర కలకలం రేపుతోంది.

Read Also: జడ్జిలపై దాడులు చేస్తే తీర్పులు ఇవ్వలేం: సుప్రీంకోర్ట్

Follow Us On : WhatsApp

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>