Mobile Popup Ad
Mobile Popup Ad

మీ ఇంట్లో పూజ గది ఇలా ఉందా? తప్పక తెలుసుకోవాల్సిన వాస్తు నిజాలు!

కలం, వెబ్‌డెస్క్: పూజ గది అనేది ఇంట్లో అత్యంత ప్రశాంతమైన, పవిత్రమైన స్థలం. ఇంటి వాతావరణం ప్రశాంతంగా ఉంచండంలో పూజ గది కీలక పాత్ర పోషిస్తుందంటున్నారు వాస్తు శాస్త్ర పండితులు. అయితే పూజ గది ఏ దిక్కులో ఉండాలి, పూజ గది విషయంలో ఎలాంటి నియమాలు (Vastu Tips) పాటించాలో ఇప్పుడు తెలుసుకుందాం.

పూజ గది ఏ దిశలో ఉండాలి

హిందూ సంప్రదాయం ప్రకారం పూజ గదిని ఈశాన్య దిశలో ఏర్పాటు చేయాలి. ఈశాన్య దిశలో పూజ గది ఉండటం వలన ఇంట్లో శుభ ఫలితాలను పొందవచ్చని సూచిస్తున్నారు పండితులు. అంతే కాకుండా చెక్కతో చేసిన పూజా మందిరం శుభ ఫలితాలను అందిస్తుందని చెబుతున్నారు పండితులు.

విగ్రహాలు ఏ దిశలో పెట్టాలి

దేవుని ముఖం తూర్పు వైపు లేదా పశ్చిమం వైపు ఉండేలా చూసుకోవడం మంచిదని సూచిస్తున్నారు పండితులు. దేవుళ్లను తూర్పు ముఖంగా పెడితే, పూజ చేసేటప్పుడు మనం పడమర వైపు తిరిగి కూర్చుంటాం. దేవుళ్లను పడమర ముఖంగా పెడితే, మనం తూర్పు వైపు తిరిగి కూర్చుంటాం. పూజ చేసేటప్పుడు తూర్పు వైపు మొహం పెట్టి కూర్చోవడం చాలా శ్రేష్ఠంగా భావిస్తారు. అయితే దేవుడి ఫోటోలను ఉత్తర దిశ వైపు ముఖం ఉండేలా కూడా పెట్టవచ్చట. అప్పుడు మనం దక్షిణ దిశ వైపు చూస్తూ పూజ చేస్తాం. దేవుడి ముఖం దక్షిణం వైపు ఉండేలా పెట్టకూడదు

దీపారాధన

మనం ప్రతిరోజూ దేవుడికి దీపారాధన చేస్తాం. అయితే పూజ గదిలో దీపం వెలిగించే ప్రదేశాన్ని శుభ్రంగా ఉండేలా చూసుకోవాలని సూచిస్తున్నారు నిపుణులు. నిత్య దీపారాధన చేయడం వలన ఇంట్లో ప్రతికూల శక్తులు పోయి సానుకూల శక్తి ప్రవహిస్తుందని నమ్ముతారు.

పగిలిన విగ్రహాలు, అనవసర వస్తువులు పెట్టొద్దు

కొంత మంది పగిలిన, విరిగిపోయిన విగ్రహాలను పారేయడం ఇష్టం లేక పూజా మందిరంలో ఉంచుతారు. అలా పెట్టకూడదని చెబుతున్నారు పండితులు. పగిలిన విగ్రహాలను ఎప్పటికప్పుడు తొలగించడమే మంచిదట. అంతే కాకుండా పూజ గదిలో అనవసర వస్తువులు ఉంచకూడదని సూచిస్తున్నారు పండితులు. అవసరం లేని వస్తువులు పూజగదిలో ఉంచడం వలన ప్రశాంతత దెబ్బతింటుందని చెబుతున్నారు.

Read Also: మంచి నిద్ర కావాలంటే ఈ చెడు అలవాట్లకు చెక్ పెట్టండి

Follow Us On: Instagram

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>