కలం, వెబ్ డెస్క్ : ఎన్టీఆర్ జిల్లా తిరువూరు (Tiruvuru) లో భూకబ్జాల వివాదం తీవ్ర ఉద్రిక్తతకు దారి తీసింది. జాతీయ రహదారి వెంట ప్రభుత్వ స్థలాలు అక్రమంగా ఆక్రమించబడుతున్నాయంటూ స్థానిక ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాసరావు (MLA Kolikapudi) నడిరోడ్డుపై ధర్నాకు దిగడం చర్చనీయాంశంగా మారింది.
తిరువూరు పట్టణంలోని ప్రధాన రహదారిపై కూర్చొని ఎమ్మెల్యే నిరసన వ్యక్తం చేశారు. జాతీయ రహదారి వెంట స్థలాలు కబ్జాకు గురవుతున్నాయి.. వెంటనే అక్రమ కబ్జాదారులను తొలగించి, ప్రభుత్వ భూములను రక్షించాలని డిమాండ్ చేశారు. ఈ నిరసనతో కొంతసేపు జాతీయ రహదారిపై ట్రాఫిక్‌కు అంతరాయం ఏర్పడింది. సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే సంఘటన స్థలానికి చేరుకుని పరిస్థితిని అదుపులోకి తీసుకువచ్చారు. ప్రయాణికులకు ఇబ్బంది కలగకుండా ట్రాఫిక్‌ను మళ్లించారు.
Read Also: బిర్యానీ ఆర్డర్ చేస్తున్నారా..? ఈ దారుణం చూడండి!
Follow Us On: Instagram

