కలం, వెబ్ డెస్క్: కండలు తీరిన దేహం కంటే మానసిక బలం చాలా గొప్పదని నిరూపించాడు ఈ తాత. మధ్యప్రదేశ్‌లోని (Madhya Pradesh) మోరెనా జిల్లాలో ఓ వృద్ధ రైతు చూపిన సాహసం ప్రస్తుతం అందరినీ ఆశ్చర్యానికి గురిచేస్తోంది. తన గేదెల మందపై దాడి చేయడానికి సిద్ధమైన చీతాను చూసి ఆ వృద్ధుడు ఏమాత్రం భయపడలేదు. తన ప్రాణాలకు తెగించి, చేతిలో ఉన్న కర్రతో ఆ క్రూర మృగాన్ని ధైర్యంగా ఎదుర్కొని తరిమేశాడు.
పశువులను ప్రాణప్రదంగా భావించే ఆ రైతు చూపిన తెగువను చూసి అటవీ శాఖ అధికారులు సైతం షాక్ అయ్యారు. సాధారణంగా చీతాలను చూస్తే జనం పరుగులు తీస్తారు. కానీ ఇక్కడ సీన్ రివర్స్ అవ్వడంతో ఈ వార్త కాస్తా సోషల్ మీడియాలో వైరల్ (Viral)గా మారింది. తాత ధైర్యానికి నెటిజన్లు ఫిదా అవుతున్నారు. నీకు సలాం అంటూ కామెంట్లు చేస్తున్నారు.
Read Also: అవార్డ్ ఫంక్షన్‌లో కమెడీయన్‌పై సెటైర్లు.. మద్దతుగా నిలిచిన సల్మాన్!
Follow Us On: Instagram

