అవార్డ్ ఫంక్ష‌న్‌లో కమెడీయ‌న్‌పై సెటైర్లు.. మ‌ద్ద‌తుగా నిలిచిన స‌ల్మాన్‌!

క‌లం, వెబ్ డెస్క్‌: బాలీవుడ్‌లో అవార్డ్ ఫంక్ష‌న్లు జ‌రిగిన‌ప్పుడ‌ల్లా ఎన్నో కాంట్ర‌వ‌ర్సీలు పుట్టుకొస్తాయి. బాలీవుడ్ స్టార్స్, హోస్టులు త‌మ కామెంట్ల‌తో హోస్ట్‌ల‌ను కించ‌ప‌ర్చేందుకు ఏమాత్రం వెనుకాడ‌రు. తాజాగా చేతక్ స్క్రీన్ అవార్డ్స్ (Chetak Screen Awards) వేడుక‌లో హోస్ట్ సౌరభ్ ద్వివేది నటుడు రాజ్‌పాల్ యాదవ్‌ (Rajpal Yadav)పై సెటైర్లు వేస్తూ రోస్ట్ చేశాడు. రాజ్‌పాల్ డాలర్, రూపాయి మార్పిడి విలువల గురించి మాట్లాడగా.. ద్వివేది స్పందిస్తూ ఎన్ని మార్పులు వచ్చినా, మీరు ఇంకా రూ.9 కోట్ల అప్పు చెల్లించాల్సిందే అంటూ త‌న పాత చెక్ బౌన్స్ కేసును గుర్తు చేస్తూ కామెంట్లు చేశాడు. దీనిపై సల్మాన్ ఖాన్ (Salman Khan) రాజ్‌పాల్ యాదవ్‌కు మద్దతుగా ఎక్స్‌లో పోస్ట్ చేశారు. మూడు దశాబ్దాలకుపైగా సినీ పరిశ్రమలో ఆయన చేసిన కృషిని ప్రశంసిస్తూ ఆయన విలువైన నటుడని కొనియాడారు. డాలర్, రూపాయి విలువ‌లు ఎలా ఉన్నా, భారతదేశంలో ఆయనకు ఎప్పటికీ అవకాశాలు ఉంటాయని, మనసు పెట్టి పని చేస్తూ ముందుకు సాగాలని సల్మాన్ భరోసా ఇచ్చారు.

రాజ్‌పాల్ పని తీరు పట్ల ఉన్న గౌరవం వల్లే అందరూ ఆయన‌ను మళ్లీ మళ్లీ సినిమాల్లోకి తీసుకుంటారని సల్మాన్ పేర్కొన్నారు. రాజ్‌పాల్ యాదవ్ తన నటనతో సినిమాలకు ప్రత్యేకమైన విలువను తీసుకువస్తారని, రెమ్యూనరేషన్ విషయంలో కూడా ఆయనకు ఎలాంటి ఇబ్బంది ఉండదని సల్మాన్ (Salman Khan) భరోసా ఇచ్చారు. డాలర్ రేటు పెరిగినా తగ్గినా మనకు వచ్చే నష్టం ఏమీ లేద‌ని, ఎందుకంటే మనం ఖర్చు చేసేది ఇండియాలోనే కదా అంటూ సరదాగా వ్యాఖ్యానించారు. అప్పుడప్పుడు ఎదుటి వాళ్ల‌ మాటలతో ఏవైనా త‌ప్పులు దొర్లినా వాటిని పట్టించుకోవద్దని, ఎప్పుడూ దిల్ ఖుష్‌గా ఉంటూ తన వృత్తిని కొనసాగించాలని రాజ్‌పాల్ యాదవ్‌కు స‌ల్మాన్ ధైర్యం చెప్పారు.

Read Also: అవును పెళ్లి చేసుకొని పిల్లల్ని కన్నాను.. త్రిష షాకింగ్ కామెంట్స్

Follow Us On : WhatsApp

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>