కలం, వరంగల్ బ్యూరో: ప్రజలకు ఆదర్శంగా నిలవాల్సిన ప్రజాప్రతినిధి ఒకరు బాధ్యతాయుతమైన పదవిలో ఉండి, ప్రభుత్వ వైద్యుడిపై నోరు పారేసుకున్నారు. భూపాలపల్లి కాంగ్రెస్ ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు (Gandra Satyanarayana) ప్రభుత్వ ఆస్పత్రి పర్యవేక్షణలో భాగంగా తీవ్ర స్థాయిలో అసహనం ప్రదర్శించారు. ఆస్పత్రి సూపరింటెండెంట్‌ను ఉద్దేశించి అందరి ముందే ‘చెత్తనా కొడకా.., యూజ్ లెస్ ఫెలో’ అంటూ తీవ్ర పదజాలంతో దూషించారు. ఆస్పత్రి నిర్వహణలో లోపాలు ఉన్నాయనే కారణంతో ఆయన సంయమనం కోల్పోయి, ఒక అధికారిని బూతులు తిట్టడం అక్కడున్న వారిని దిగ్భ్రాంతికి గురిచేసింది.
ఘటన వివరాల్లోకి వెళితే, ఆస్పత్రిలో వైద్య సేవలు సక్రమంగా అందడం లేదని, రోగులు ఇబ్బంది పడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు (Gandra Satyanarayana Rao) అధికారులను ప్రశ్నించారు. ఈ క్రమంలో సమాధానం చెబుతున్న సూపరింటెండెంట్‌పై ఆయన ఒక్కసారిగా విరుచుకుపడ్డారు. పక్కనే మీడియా ప్రతినిధులు, సిబ్బంది, రోగులు ఉన్నారన్న విషయాన్ని కూడా విస్మరించి అసభ్య పదజాలంతో దాడికి దిగారు. ప్రస్తుతం ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. బాధ్యత గల ఎమ్మెల్యే ఇలా బహిరంగంగా బూతులు తిట్టడంపై నెటిజన్లు విమర్శిస్తున్నారు.
ప్రభుత్వ వైద్యుడిపై నోరు పారేసుకున్న కాంగ్రెస్ ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు
Bhupalpally Congress MLA Gandra Satyanarayana Rao Abuses Govt Doctor in Public#GandraSatyanarayanaRao #Bhupalapally #GovtDoctor #Kalam #KalamDaily #KalamTelugu pic.twitter.com/7jFSCPZaOM— Kalam Daily (@kalamtelugu) April 9, 2026
Read Also: జనాభా లెక్కలు.. ఎన్నో ప్రశ్నలు
Follow Us On : WhatsApp

