కలం, వెబ్ డెస్క్ : మెదక్ జిల్లా నర్సాపూర్ మున్సిపాలిటీ పరిధిలో ఘోర రోడ్డు ప్రమాదం (Narsapur Road Accident) చోటు చేసుకుంది. రోడ్డుపై వేగంగా వచ్చిన ఒక గూడ్స్ ఆటో అదుపుతప్పి ఓ బైక్ ను బలంగా ఢీకొట్టింది. ఈ ప్రమాద తీవ్రతకు బైక్ పై ఉన్న వ్యక్తి అక్కడికక్కడే ఎగిరిపడ్డాడు. తీవ్ర గాయలపాలైన అతన్ని ఆసుపత్రికి తరలించే లోపే ఘటనా స్థలంలోనే మృతి చెందాడు. ఈ ప్రమాదానికి సంబంధించిన భయానక దృశ్యాలు సమీపంలోని సీసీటీవీ మెరాల్లో స్పష్టంగా రికార్డయ్యాయి.
విషయం తెలుసుకున్న పోలీసులు హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకుని పరిస్థితిని సమీక్షించారు. మృతుడిని స్థానికంగా నివసిస్తున్న ఎరుకలి ఎల్లయ్యగా గుర్తించారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం నర్సాపూర్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించిన పోలీసులు, ప్రమాదానికి గల కారణాలపై ఆరా తీస్తున్నారు. సీసీటీవీ దృశ్యాలను స్వాధీనం చేసుకున్న పోలీసులు.. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు వేగవంతం చేశారు.

