Mobile Popup Ad
Mobile Popup Ad

జనాభా లెక్కలు.. ఎన్నో ప్రశ్నలు

కలం, తెలంగాణ బ్యూరో: దేశంలోనే ఫస్ట్ టైమ్ డిజిటల్ సెన్సస్ (Digital Census) ప్రారంభమైంది. మొత్తం రెండు దశల్లో జనగణన జరుగుతున్నది. ఫస్ట్ ఫేజ్‌‌లో హౌజ్ లిస్టింగ్, హౌజింగ్ సెన్సస్ ఈ నెల నుంచి సెప్టెంబరు చివరి వరకు జరుగుతుంది. సెకండ్ ఫేజ్‌‌లో జనాభా లెక్కల సేకరణ వచ్చే ఏడాది ఫిబ్రవరిలో ఉంటుంది. స్వతంత్ర భారత్‌‌లో మొదటిసారి కులగణన కూడా చేపడుతున్నారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత జరుగుతున్న మొదటి జనాభా లెక్కల సేకరణ ఇది. షెడ్యూలు ప్రకారం 2021లో సెన్సస్ జరగాల్సి ఉన్నప్పటికీ కరోనా కారణంగా వాయిదా పడింది.

దేశవ్యాప్తంగా సుమారు 34 లక్షల మంది సిబ్బంది ప్రతీ ఒక్కరి వివరాలను సేకరించనున్నారు. తెలంగాణలో దాదాపు 94 వేల మంది స్టాఫ్ ఈ ప్రక్రియలో పాల్గొంటున్నారు. ఆన్‌‌లైన్‌‌లో వెబ్‌‌సైట్ ద్వారా ప్రజలే స్వచ్ఛందంగా వారి వివరాలను నమోదు చేసుకునే వెసులుబాటూ ఉన్నది. కొన్ని రాష్ట్రాల్లో ఈ నెల ఫస్ట్ నుంచి ఇది అమల్లోకి వచ్చింది. రాష్ట్రపతి, ప్రధాని, సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ తదితరులంతా ఆన్‌‌లైన్ ద్వారానే వివరాలను నమోదు చేసుకున్నారు. సెల్ఫ్ ఎన్యూమరేషన్ పేరుతో జరిగే ఈ ప్రక్రియ షెడ్యూలు ఒక్కో రాష్ట్రానికి ఒక్కో రకంగా ఉన్నది. తెలంగాణలో ఈ నెల 26 నుంచి మే 10వ తేదీ వరకు ఇది ఉంటుంది.

పౌరసత్వంతో సంబంధం లేకుండా దేశంలో నివసిస్తున్న ప్రతి ఒక్కరి వివరాలు నమోదు చేయడం.. ఏ ఒక్కరి వివరాలు డబుల్ ఎంట్రీ కాకుండా చూసుకోవడం.. క్వాలిటీ డేటాను సేకరించడం.. ఈ మూడు మంత్రదండాలతో సెన్సస్ ప్రక్రియ జరగనున్నది. ప్రభుత్వాలు అమలు చేస్తున్న సంక్షేమ కార్యక్రమాలతో ఎలాంటి సంబంధం లేకుండా ప్రతీ ఒక్కరి వివరాలను కేంద్ర హోంశాఖ పరిధిలోని సెన్సస్ రిజిస్ట్రార్ జనరల్ కార్యాలయం ఈ ప్రక్రియను చేపడుతున్నది. వచ్చే ఏడాది ఫిబ్రవరి 28 అర్ధరాత్రి 12 గంటల సమయాన్ని రిఫరెన్సుగా తీసుకుని జననం, మరణం, సజీవం.. ఆధారంగా వివరాలను సిబ్బంది సేకరించనున్నారు.

జనాభా లెక్కల సేకరణలో భాగంగా ఫస్ట్ ఫేజ్‌‌లో ఏమేం ప్రశ్నలుంటాయి?.. సెకండ్ ఫేజ్‌‌లో ఏముంటాయి?.. వివరాలు ఇవ్వాల్సిందేనా?.. వెల్లడించిన సమాచారం గోప్యంగా ఉంటుందా?.. వాస్తవాలు చెప్తే సంక్షేమ పథకాల అర్హత కోల్పోయినట్లేనా?.. తప్పుడు సమాచారం ఇస్తే ఏం జరుగుతుంది?.. స్థిరనివాసం లేకుండా సంచార జీవనం సాగిస్తున్నవారి వివరాలను ఎలా సేకరిస్తారు?.. హాస్టళ్లలో ఉండేవారి వివరాల సేకరణకు అనుసరించే పద్ధతేంటి?.. ఇలాంటి అంశాలపై ‘కలం 360 డిగ్రీస్‘ ప్రత్యేక కథనం చదివేందుకు కింద ఉన్న ఇమేజ్ పై క్లిక్ చేయండి.

Digital Census
Digital Census

Read Also: తెలంగాణ టూరిజం.. సమ్మర్ లో చుట్టేద్దాం

Follow Us On : WhatsApp

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>