Mobile Popup Ad
Mobile Popup Ad

నిజామాబాద్‌లో దివ్యాంగ విద్యార్థులకు సహాయక పరికరాల పంపిణీ

కలం, నిజామాబాద్ బ్యూరో : సమగ్ర శిక్ష, విద్యాశాఖ, అలింకో సంయుక్త ఆధ్వర్యంలో సోమవారం నిజామాబాద్ (Nizamabad) నగరంలోని చంద్రశేఖర్ కాలనీలో దివ్యాంగ విద్యార్థులకు ఉపకరణాలను పంపిణీ జరిగింది. ఈ కార్యక్రమంలో అర్బన్ ఎమ్మెల్యే ధన్‌పాల్ సూర్యనారాయణ (MLA Dhanpal Suryanarayana) పాల్గొన్నారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ.. అంగవైకల్యం భారం కాదు, వారికి సేవ చేయడం భాగ్యంగా భావించాలని చెప్పారు. పిల్లలకు అంగ వైకల్యం ఉందని బాధపడొద్దని, భవిత కేంద్రాలలో అందజేస్తున్న సేవలను వినియోగించుకోవాలని సూచించారు. అంగవైకల్యం ఉన్న ప్రతి విద్యార్థికి భగవంతుడు ఏదో ఒక ప్రతిభను ఇస్తాడని అన్నారు. లూయిస్ బ్రెయిలీ, సంగీత మేధావి రవీంద్ర జైన్, దివ్యాంగ నృత్య కళాకారిని సుధాచంద్రన్ వంటి  ప్రతిభావంతులను ఆదర్శంగా తీసుకోవాలని సూచించారు.

కేంద్ర ప్రభుత్వ నిధులతో ఉపకరణాలను అందజేయడమే కాకుండా భవిత కేంద్రాలను కూడా నిర్మిస్తామని ఎమ్మెల్యే (MLA Dhanpal) తెలిపారు. సదరం సర్టిఫికెట్ ఉన్నవారికి వికలాంగుల పెన్షన్ అందేలా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని, కొత్త పెన్షన్లను కూడా ప్రారంభించాలని డిమాండ్ చేశారు. ఇప్పటికే అనేకసార్లు మంత్రులు, అధికారులు దృష్టికి తీసుకెళ్లానని, త్వరలో సీఎం రేవంత్ రెడ్డిని కలిసి లేఖ అందిస్తానని అన్నారు.

ఈ కార్యక్రమంలో 393 మంది విద్యార్థులకు 34 లక్షల రూపాయల విలువగల ఉపకరణాలు అందజేయబడ్డాయి. అంతకుముందు కొత్తగా నిర్మించిన భవిత కేంద్రాన్ని ప్రారంభించారు. కార్యక్రమంలో డిఇఓ అశోక్, ఎంఈవోలు సాయారెడ్డి, ఎన్ఆర్ గౌడ్, ప్లానింగ్ కోఆర్డినేటర్ శ్రీధర్ రెడ్డి, శ్రీనివాస్, అలింకో ప్రతినిధులు డాక్టర్ ప్రత్యూష్, 39వ డివిజన్ కార్పొరేటర్ జ్యోతి మురళి, బీజేపీ నాయకులు ప్రభాకర్, పవన్ ముందడ, కైరం కొండ మురళి తదితరులు పాల్గొన్నారు.

Read Also: రాష్ట్రాన్ని రెండుగా పంచుకున్న కేటీఆర్, హరీశ్‌రావు

Follow Us On : WhatsApp

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>