తెలంగాణ ప్రజానాట్య మండలి కార్య‌వ‌ర్గం ఎన్నిక‌

కలం, కరీంనగర్ బ్యూరో: తెలంగాణ ప్రజానాట్య మండలి (Telangana Praja Natya Mandali ) కరీంనగర్ జిల్లా అధ్యక్షులుగా తిమ్మాపూర్ మండలం మొగిలిపాలెం గ్రామానికి చెందిన వరకోలు సదానందం ఎన్నిక‌య్యారు. అలాగే జిల్లా ప్రధాన కార్యదర్శిగా చిగురుమామిడి మండలం రేకొండ గ్రామానికి చెందిన దుడ్డేల సమ్మయ్య ఎన్నిక‌య్యారు. ఈ మేర‌కు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పల్లె నర్సింహ వీరి ఎన్నిక‌ను ప్ర‌క‌టించారు. కరీంనగర్‌లోని బద్దం ఎల్లారెడ్డి భవన్‌లో జిల్లా మహాసభ జరిగింది. ఆ మహాసభలో నూతన కమిటీని ఎన్నుకోవడం జరిగిందని వెల్ల‌డించారు. సదానందం, సమ్మయ్యతో పాటు జిల్లా ఉపాధ్యక్షులుగా కెంసారం కోమల, బరిగెల విజయ్, నరేష్ జిల్లా సహాయ కార్యదర్శులుగా మంజుల, అందె తిరుపతి, సత్రం సరిత జిల్లా కోశాధికారిగా బోలుమల్ల రాజమౌళిలను ఎన్నుకున్న‌ట్లు పల్లె నర్సింహ తెలిపారు.

ఈ సందర్భంగా నూతనంగా ఎన్నికైన జిల్లా అధ్యక్ష, ప్రధాన కార్యదర్శి సదానందం, సమ్మయ్యలు మాట్లాడుతూ.. కళ కళ కోసం కాదు ప్రజల కోసమనే నినాదాన్ని పూర్తిగా విశ్వసించి ప్రజల కష్ట, సుఖాలపై పాటలు పాడుతామన్నారు. సమాజంలో జరిగే పరిణామాలను అవగాహన చేసుకొని సమాజ హితం కోసం కళాకారులుగా త‌మ వంతు కర్తవ్యాన్ని నిర్వర్తిస్తామని చెప్పారు. ఎన్నికకు సహకరించిన రాష్ట్ర నాయకత్వానికి, సీపీఐ జిల్లా కార్యదర్శి పంజాల శ్రీనివాస్‌కు కృతజ్ఞతలు తెలిపారు.

Read Also: రియల్ మాడ్రిడ్‌లో ముసలం.. కోచ్ మారే అవకాశం?

Follow Us On: Instagram

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>