మాజీ సైనికులతో అర్బన్ ఎమ్మెల్యే భేటీ

కలం, నిజామాబాద్ బ్యూరో: నిజామాబాద్ జిల్లాలోని మాజీ సైనికులు, వారి కుటుంబసభ్యుల సమస్యల పరిష్కారానికి తనవంతు కృషి చేస్తానని అర్బన్ ఎమ్మెల్యే ధన్‌పాల్ సూర్యనారాయణ గుప్త (MLA Dhanpal) తెలిపారు. ఇందూరు నగరంలోని ఎమ్మెల్యే కార్యాలయంలో శుక్రవారం అసోసియేషన్ ప్రతినిధులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. మాజీ సైనికులకు అందాల్సిన సంక్షేమ పథకాల్లో జాప్యం జరుగుతుందన్నారు.

మాజీ సైనికుల సమస్యలివే..

ప్రధానంగా ఆస్తి పన్ను, ప్రభుత్వ ఉద్యోగాల్లో రిజర్వేషన్, ఇళ్ల స్థలం, వ్యవసాయ భూములు తదితర పథకాలు తొందరగా అమలు కావడం లేదని తన దృష్టికి తీసుకొచ్చారన్నారు. సంబంధితశాఖ అధికారులతో మాట్లాడి సమస్య పరిష్కారానికి కృషి చేస్తానని హామీ ఇచ్చారు. ఆస్తిపన్ను విషయంలో మున్సిపల్ అధికారులతో మాట్లాడతానని భరోసా ఇచ్చారు. మాజీ సైనిక సంక్షేమ సంఘం ప్రతినిధులతో సమావేశం నిర్వహించిన మొదటి ఎమ్మెల్యే ధన్‌పాల్ సూర్యనారాయణ అని సంఘం జిల్లా అధ్యక్షుడు సూర హర ప్రసాద్ తెలిపారు. తమ సమస్యలను ప్రత్యేకంగా విన్నారన్నారు. అనంతరం వినతి పత్రం అందజేశారు. సమావేశంలో సంఘం ప్రధాన కార్యదర్శి దివాకర్ రెడ్డి, ఉపాధ్యక్షుడు మధుసూదన్, సహాయ కార్యదర్శి రూపేశ్ కుమార్, సలహాదారుడు మోహన్, కోశాధికారి థామస్ తదితరులు పాల్గొన్నారు.

Read Also: ఫస్ట్ బెంగాల్, నెక్స్ట్ ఢిల్లీ.. ఎన్నికల ప్రచారంలో మమతా బెనర్జీ

Follow Us On : WhatsApp

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>