పార్టీ మార్పు ప్రచారానికి తెర దించిన మాజీ మంత్రి: ఏమన్నారంటే?

కలం, వెబ్ డెస్క్ : పార్టీ మార్పు అంశంపై వస్తున్న ప్రచారానికి మాజీ మంత్రి, మేడ్చల్ ఎమ్మెల్యే చామకూర మల్లారెడ్డి (Malla Reddy) తెర దించారు. తనకు పార్టీ మారే ఆలోచన ఏమాత్రం లేదని, భవిష్యత్తులోనూ బీఆర్‌ఎస్‌ పార్టీలోనే కొనసాగుతానని ఆయన స్పష్టం చేశారు. మేడ్చల్ నియోజకవర్గానికి చెందిన ఒక బీఆర్‌ఎస్ కార్యకర్త తన రక్తం‌తో రాసిన లేఖ విషయం తనను ఎంతగానో బాధించిందని మల్లారెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు.

ఆ లేఖపై ఎటువంటి చిరునామా లేనప్పటికీ, ఎలాగైనా అతని వివరాలు తెలుసుకుని స్వయంగా కలుస్తానని ఆయన పేర్కొన్నారు. కాగా, బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ జన్మదినాన్ని పురస్కరించుకుని బోయిన్‌పల్లిలోని తన నివాసంలో కార్యకర్తలతో కలిసి మల్లారెడ్డి కేక్ కట్ చేసి శుభాకాంక్షలు తెలిపారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>