Mobile Popup Ad
Mobile Popup Ad

ORR-RRR మధ్య ఇండస్ట్రియల్ పార్కులు: మంత్రులు

కలం, వెబ్ డెస్క్: కాలుష్య రహిత హైదరాబాద్ కోసం కాలుష్యకారక పరిశ్రమలను ఓఆర్ఆర్ (ORR) అవతలికి తరలించాలని అధికారులను మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి (Uttam Kumar Reddy), శ్రీధర్ బాబు, జూపల్లి కృష్ణారావు ఆదేశించారు. ఓఆర్ఆర్-ఆర్ఆర్ఆర్ మధ్య అంతర్జాతీయ ప్రమాణాలతో ఇండస్ట్రియల్ పార్కులను ఏర్పాటు చేయాలని సూచించారు. తెలంగాణ రాష్ట్ర సచివాలయంలో ‘మొబిలైజేషన్ ఆఫ్ రిసోర్సెస్’ (Mobilization of Resources) కేబినెట్ సబ్ కమిటీ సమావేశం నిర్వహించడం జరిగింది. హైదరాబాద్ నగరాన్ని, రాష్ట్రాన్ని ప్రణాళికాబద్ధంగా అభివృద్ధి చేయడమే లక్ష్యంగా ప్రవేశపెట్టిన హైదరాబాద్ ఇండస్ట్రియల్ ల్యాండ్స్ ట్రాన్స్‌ఫార్మేషన్ (HILT Policy) పాలసీపై ఈ సమావేశంలో ఇండస్ట్రియల్ ఎస్టేట్స్ ప్రతినిధులతో సుదీర్ఘంగా చర్చించారు.

ప్రజాస్వామ్య పద్ధతిలో అందరి అభిప్రాయాలను పరిగణనలోకి తీసుకొని ఈ పాలసీని అమలు చేస్తామని తెలిపారు. పరిశ్రమల తరలింపులో పారిశ్రామికవేత్తలకు, కార్మికులకు ప్రభుత్వం పూర్తి సహకారం అందిస్తుందని చెప్పారు. రాష్ట్ర ఆదాయ వనరులను పెంచే చర్యల్లో భాగంగా, మే మొదటి వారం నుంచి సవరించిన భూముల మార్కెట్ విలువలను అమలులోకి తీసుకురావాలని రిజిస్ట్రేషన్ శాఖ అధికారులను ఆదేశించారు. రాష్ట్ర సర్వతోముఖాభివృద్ధికి అధికారులు సమన్వయంతో పనిచేసి నిర్దేశిత లక్ష్యాలను చేరుకోవాలని సూచించారు.

Read Also: కార్పొ’రేట్’ వైద్యం.. తెలంగాణలో ప్రైవేట్ హాస్పిటల్స్ దోపిడీ

Follow Us On: Sharechat

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>