ఏపీలో మరో రెండు కోవిడ్ కేసులు నమోదు

కలం, వెబ్ డెస్క్: ఏపీలో కరోనా చాపకింద నీరులా విస్తరిస్తోంది. రాష్ట్రంలో తాజాగా మరో రెండు కరోనా కేసులు (New COVID Cases) నమోదవడం ఆందోళన కలిగిస్తోంది. ఏలూరు జిల్లాలో ఒక కరోనా కేసు, గుంటూరు జిల్లాలో మరో కరోనా కేసు నిర్ధారణ అయింది. ఈ రెండు కొత్త కేసులతో కలిపి రాష్ట్రవ్యాప్తంగా మొత్తం కరోనా కేసుల సంఖ్య 34కు చేరుకుంది. ఇప్పటికే కరోనా వ్యాప్తిని అరికట్టేందుకు దృష్టి సారించిన రాష్ట్ర ప్రభుత్వం.. కొత్త కేసులు నమోదవడంతో వైద్యాధికారులను అప్రమత్తం చేసింది. రాష్ట్ర వ్యాప్తంగా కేసులు పెరగకుండా పటిష్ట జాగ్రత్తలు తీసుకునేందుకు కీలక చర్యలు చేపట్టింది. ప్రస్తుతం ప్రతి కేసును ప్రత్యేకంగా పర్యవేక్షిస్తూ అవసరమైన వైద్య సేవలను అందిస్తోంది.

కోవిడ్ నిర్ధారణ అయిన వారికి తక్షణమే వైద్య పరీక్షలు నిర్వహించి ఇసోలేషన్ లో ఉంచి వారి ఆరోగ్య పరిస్థితిని ఎప్పటికప్పుడు అంచనా వేస్తున్నారు. వారినుంచి మిగితావారికి సోకకుండా తగిన జాగ్రత్తలు తీసుకుంటున్నారు. అవసరమైన చికిత్సతో పాటు వైద్యుల పర్యవేక్షణలో ఉంచి కోలుకునేలా చికిత్స చేస్తున్నారు. బాధితుల ఆరోగ్య పరిస్థితిని పరిశీలిస్తూ అవసరమైన మందులు, వైద్య సదుపాయాలు అందుబాటులో ఉంచారు. అలాగే బాధితులతో ఇటీవల సన్నిహితంగా ఉన్న వ్యక్తులను గుర్తించి వారికి కూడా కరోనా పరీక్షలు నిర్వహించే ప్రక్రియ కొనసాగుతోంది. అవసరమైతే వారిని ఐసోలేషన్‌లో ఉంచి వైద్యుల పర్యవేక్షణలో ఉంచుతున్నారు.

కరోనా పెరుగుతున్న నేపథ్యంలో వైద్యాధికారులు రాష్ట్ర ప్రజలకు ముఖ్య సూచనలు చేశారు. కోవిడ్ వ్యాప్తి మరింత పెరగకుండా ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని ఆరోగ్య శాఖ ప్రజలకు సూచిస్తోంది. జ్వరం, దగ్గు, గొంతునొప్పి, అలసట, శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది వంటి లక్షణాలు కనిపించిన వెంటనే సమీప ప్రభుత్వ ఆసుపత్రిని సంప్రదించాలని అధికారులు కోరుతున్నారు. వ్యాధి ప్రారంభ దశలోనే పరీక్షలు చేయించుకోవడం వల్ల కోవిడ్ వ్యాపించకుండా అరికట్టవచ్చని తెలుపుతున్నారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>