Mobile Popup Ad
Mobile Popup Ad

విద్యుత్ ఆర్టిజన్ ఉద్యోగుల ధర్నాకు ఎమ్మెల్యే ధన్ పాల్ సూర్యనారాయణ మద్దతు

కలం, నిజామాబాద్ బ్యూరో : విద్యుత్ ఆర్టిజన్ ఎంప్లాయిస్ డిమాండ్లను రాష్ట్ర ప్రభుత్వం నెరవేర్చాల్సిందేనని ఇందూరు బీజేపీ ఎమ్మెల్యే ధన్ పాల్ సూర్యనారాయణ (MLA Suryanarayana) డిమాండ్ చేశారు. తెలంగాణ విద్యుత్ ఆర్టిజన్ ఎంప్లాయిస్ చేపట్టిన ధర్నాకు మంగళవారం ఆయన మద్దతు తెలిపారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే ధన్ పాల్ మాట్లాడుతూ.. ప్రభుత్వం ఉద్యోగులకు ఇచ్చిన హామీలు అమలుపరచడంలో ప్రభుత్వం విఫలమైందని విమర్శించారు. ప్రధానంగా విద్యార్హతను బట్టి ప్రమోషన్లు కల్పించాలని సూచించారు. అలాగే రెగ్యులర్ ఉద్యోగుల మాదిరిగా బెనిఫిట్స్ ఇవ్వాలని ఆయన  డిమాండ్ చేశారు. ఒకే సంస్థ ఒకే రూల్ ఉండే విధంగా చూడాలన్నారు.

పని దినాలను తగ్గించి న్యాయం చేయాలన్నారు. గత ఏడు రోజులుగా రాష్ట్రవ్యాప్తంగా ధర్నా చేస్తున్నా.. ప్రభుత్వానికి చీమకుట్టినట్టు కూడా లేదన్నారు. ఉద్యోగులకు మద్దతుగా తన వంతుగా లేఖను అందజేస్తానని చెప్పారు.. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి, విద్యుత్ శాఖమంత్రి బట్టి విక్రమార్కకు వచ్చే మూడు రోజుల్లో లేఖను అందజేస్తానని స్పష్టం చేశారు. కార్యక్రమంలో తెలంగాణ రాష్ట్ర విద్యుత్ ఆర్టిజన్ ఎంప్లాయిస్ జేఏసీ ప్రతినిధులు గంగాధర్ రవి షాదుల్లా సతీష్, బిజెపి కార్పొరేటర్లు జగదీష్ కులకర్ణి, మఠం పవన్, కల్పే అర్చనా చిరంజీవి, ఇప్పకాయల సుమిత్ర కిషోర్ తదితరులు పాల్గొన్నారు.

Read Also: అధికారముంటేనే వెళ్తారా?.. క్రెడిట్ కోసమే అంబేద్కర్ విగ్రహమా?..

Follow Us On : WhatsApp

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>