కలం, వెబ్ డెస్క్ : విశాఖపట్నంలో జనసేన ఎమ్మెల్యే వంశీకృష్ణ (Vamsikrishna) శ్రీనివాస్ యాదవ్ తీరు ఇప్పుడు వివాదాస్పదంగా మారింది. నైట్ ఫుడ్ కోర్ట్ (Night Food Court) పునఃప్రారంభించాలని కోరుతూ వినతిపత్రం అందజేయడానికి వచ్చిన సిఐటియు నేతలపై ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. గత కొన్ని రోజులుగా నైట్ ఫుడ్ కోర్టును మూసివేయడంతో ఉపాధి కోల్పోయిన బాధితులు, వారికి మద్దతుగా సిఐటియు నాయకులు రిలే నిరాహార దీక్షలు చేపడుతున్నారు.
ఈ క్రమంలోనే సమస్యను వివరించి, ఫుడ్ కోర్టును తిరిగి తెరిపించేలా చొరవ తీసుకోవాలని కోరుతూ నేతలు ఎమ్మెల్యేను కలిశారు. అయితే వారి విన్నపాన్ని స్వీకరించడానికి నిరాకరించిన వంశీకృష్ణ, ఆగ్రహంతో వినతిపత్రాన్ని కమ్యూనిస్టు నేతలపైకి విసిరికొట్టారు. ప్రజాప్రతినిధిగా ఉండి సమస్యను వినాల్సింది పోయి, ఇలా దురుసుగా ప్రవర్తించడం సరికాదని బాధితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
-సీఐటీయూ నాయకుల వినతిపత్రం విసిరికొట్టిన జనసేన ఎమ్మెల్యే
-ఎమ్మెల్యే వంశీకృష్ణ తీరుపై మండిపడుతున్న సీఐటీయూ నాయకులు
JanaSena MLA Vamsi krishna Srinivas is angry with CITU leaders for throwing away the petition!#Vizag #VamsikrishnaSrinivas #JanaSenaMLA #CITUpetition… pic.twitter.com/wNgO22JLk8— Kalam Daily (@kalamtelugu) April 14, 2026
Read Also: నారీ శక్తి వందన్.. రాష్ట్ర ఎంపీలకు సీఎం చంద్రబాబు లేఖ
Follow Us On: X(Twitter)

