Mobile Popup Ad
Mobile Popup Ad

మహిళా ఎమ్మెల్యేతో కాంగ్రెస్ నేత అసభ్య ప్రవర్తన.. వీడియో వైరల్

కలం, వెబ్ డెస్క్: కేరళలో కాంగ్రెస్ కూటమి ఘన విజయం సాధించిన విషయం తెలిసిందే. అయితే ఆ రాష్ట్రానికి చెందిన ఓ కీలక నేత ప్రవర్తించిన తీరుపై విమర్శలు వస్తున్నాయి. ఈ ఘటన ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. కేరళకు చెందిన ప్రముఖ కాంగ్రెస్ నేత చెరియన్ ఫిలిప్ కొత్తగా విజయం సాధించిన  మహిళా ఎమ్మెల్యే బిందు కృష్ణ(Bindu Krishna)ను హగ్ చేసుకోబోయారు.. అందుకు ఆమె నిరాకరించారు. ఈ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది.

అసలేం జరిగింది?

ఇటీవలి అసెంబ్లీ ఎన్నికల్లో కొత్తగా ఎన్నికైన కొల్లం ఎమ్మెల్యే బిందు కృష్ణ పార్టీ సమావేశానికి హాజరయ్యారు. తొలుత మీడియా ప్రతినిధులను పలకరించి అనంతరం చెరియన్ ఫిలిప్ వద్దకు వెళ్లారు. అతడికి షేక్ హ్యాండ్ ఇచ్చేందుకు యత్నించారు. కానీ చెరియన్ హగ్ చేసుకోవడానికి యత్నించగా బిందు కృష్ణ వెనక్కి తగ్గినట్లు వీడియోలో కనిపిస్తోంది.  అయినప్పటికీ చెరియన్ ఫిలిప్ మరోసారి ఆమెను ఆలింగనం చేసుకునే ప్రయత్నం చేశాడు. చివరకు బిందు చేతులు జోడించి ముందుకు సాగారు.

చెరియన్ తీరుపై విమర్శలు

ఈ ఘటనపై సోషల్ మీడియాలో తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ప్రజా జీవితంలో ఉన్న నేతలు వ్యక్తిగత హద్దులను గౌరవించాల్సిన అవసరాన్ని పలువురు నెటిజన్లు ప్రస్తావిస్తున్నారు. ఎదుటి వ్యక్తులు అసౌకర్యంగా ఫీల్ అయినప్పుడు వారి గౌరవాన్ని కాపాడాలని సూచిస్తున్నారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>