టాలీవుడ్ యంగ్ హీరో తేజ సజ్జ నటించిన తాజా సినిమా ‘మిరాయ్(Mirai)’ థియేటర్లను షేక్ చేసింది. భారీ కలెక్షన్లు రాబట్టింది. ఇప్పుడు ఓటీటీలో కూడా తన హవా నడిపిస్తోంది. వ్యూస్ విషయంలో తగ్గేదేలేదంటోంది. ఇప్పటి వరకు భారీ సంఖ్యలో వ్యూస్ సంపాదించింది. ఇప్పటి వరకు 200+ మిలియన్ స్ట్రీమింగ్ మినిట్స్‌ను పూర్తి చేసుకుంది. ఈ విషయాన్ని జియో హాట్‌స్టార్(Jiohotstar) వెల్లడించింది. ‘మిరాయ్’ ఇండియాలోనే కాదు పలు విదేశాల్లో కూడా టాప్ ట్రెండింగ్ మూవీగా నిలుస్తోంది. దీపావళి వీకెండ్‌లో అత్యధికంగా వీక్షించిన మూవీగా మిరాయ్ నిలిచింది. ‘మిరాయ్’ హవా ఇంకా నడుస్తుందని జియో హాట్ స్టార్ వెల్లడించింది.
Read Also: ఒక్క రాత్రిలో అంతా కోల్పోయాం: రాపో

