epaper
Tuesday, November 18, 2025
epaper

లక్ష్మీ నాయుడు హత్య కేసుపై సీఎం ఆరా..

రాష్ట్రంలో శాంతిభద్రతలపై సీఎం నారా చంద్రబాబు నాయుడు(Chandrababu) సమీక్ష నిర్వహించారు. ఇందులో అన్ని జిల్లాల్లోని పరిస్థితులపై చర్చించారు. ప్రజలకు పూర్తి రక్షణ అందించేలా చర్యలు తీసుకోవాలని, ఇప్పటి వరకు ఎలాంటి చర్యలు తీసుకున్నారని అధికారులను అడిగారు. ఈ క్రమంలోనే ఉత్తరాంధ్రలో జరిగిన లక్ష్మీ నాయుడు హత్యపై ఆరా తీశారు. ఈ కేసు దర్యాప్తులో వేగం పెంచాలని తెలిపారు. ఫాస్ట్ర ట్రాక్ కోర్టులో ఈ కేసు దర్యాప్తును వేగంగా జరిపించాలని ఆదేశించారు. ఈ కేసు విషయంలో న్యాయవాదులపై ప్రత్యేక దృష్టి పెడుతూ, విచారణ కోసం ప్రత్యేక పీపీఎల్ (ప్రత్యేక ప్రభుత్వ పూర్వక ఎడ్వకేట్)ను నియమించాలని సూచించారు.

లక్ష్మీ నాయుడు కుటుంబానికి పరిహారం అందించాలని కూడా సీఎం నిర్ణయించారు. భార్యకు 2 ఎకరాలు భూమి, రూ. 5 లక్షల నగదు పరిహారం ఇచ్చేందుకు ప్రభుత్వం ముందుకు వచ్చింది. అలాగే, ఈ దాడిలో గాయపడిన పవన్, భార్గవ్‌లకు కూడా పరిహారం అందించాలని సీఎం Chandrababu నిర్ణయించారు.

అసలు కేసు ఏంటంటే..

గుడ్లూరు మండలం రాళ్లపాడుకు చెందిన తిరుమలశెట్టి లక్ష్మీనాయుడు కొన్ని రోజుల ముందు హత్యకు గురయ్యారు. అతను బైక్‌పై ప్రయాణిస్తున్న సమయంలో వారి గ్రామానికే చెందిన హరిశ్చంద్రప్రసాద్ అనే వ్యక్తి కారుతో ఢీకొట్టి హతమార్చాడు. ఈ హత్య ఏపీలో తీవ్ర రాజకీయ దుమారం రేపుతోంది. తమ పార్టీకి చెందిన వ్యక్తి కాబట్టే హరిశ్చంద్రను కాపాడటానికి టీడీపీ.. కేసును తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేస్తోందని వైసీసీ ఆరోపిస్తోంది. అయితే వ్యక్తిగత కక్షల కారణంగానే లక్ష్మీనాయుడు హత్య జరిగిందని పోలీసులు తెలిపారు. తాజాగా లక్ష్మీనాయుడు కుటుంబానికి ప్రభుత్వం భారీగా ఎక్స్‌గ్రేషియా ప్రకటించింది. లక్ష్మీనాయుడు భార్యకు రూ.5 లక్షల నగదు, రెండు ఎకరాల భూమి ప్రకటించింది ప్రభుత్వం. దాంతో పాటుగానే లక్ష్మీనాయుడు ఇద్దరు పిల్లలకు చెరో రెండు ఎకరాలతో పాటు రూ.5 లక్షల నగదును బ్యాంకులో ఫిక్సిడ్ డిపాజిట్ చేయాలని అధికారులను సీఎం చంద్రబాబు ఆదేశించారు.

Read Also: జపాన్‌కు తొలి మహిళా ప్రధాని.. రికార్డ్ సృష్టించిన తకైచి

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>