ఒక్క రాత్రి తమ జీవితంలో ఊహించని దెబ్బ తీసిందని ఎనర్జిటిక్ హీరో రామ్ పోతినేని(Ram Pothineni) చెప్పిన విషయాలు అందరినీ షాక్‌కు గురిచేస్తున్నాయి. అప్పటి వరకు సంపాదించింది మొత్తం ఒక్క రాత్రిలో కోల్పోయామని, దాంతో తమ నాన్న మళ్ళీ జీరో నుంచి స్టార్ట్ చేయాల్సి వచ్చిందని రాపో వివరించాడు. తాజాగా జగపతిబాబు హోస్ట్ చేస్తున్న టాక్ షో ‘జయమ్ము నిశ్చయమ్మురా’లో రాపో పార్టిసిపేట్ చేశాడు. ఆ సందర్భంగా అతడు తన జీవితంలో చాలా తక్కువ మందికి తెలిసిన కొన్ని విషయాలను పంచుకున్నాడు.
‘‘మా అమ్మ వాళ్లది హైదరాబాద్. నేను ఇక్కడే పుట్టాను. ఆ తర్వాత విజయవాడ వెళ్లాం. 1988లో విజయవాడ కుల ఘర్షణలు తారాస్థాయికి వెళ్లాయి. ఆ ఘర్షణల్లో మా కుటుంబం అంతా కోల్పోయింది. అప్పటి వరకు సంపాదించిందంతా ఒక్క రాత్రిలో పోయింది. ఇక అక్కడ ఉండటం సరికాదని భావించిన మా కుటుంబం చెన్నైకి షిఫ్ట్ అయింది. అక్కడ మళ్ళీ జీరో నుంచి మా నాన్న తన కెరీర్ స్టార్ట్ చేశారు. ఆ రోజు మేమెంత కోల్పోయాం అంటే.. విజయవాడలో ఉన్న మా ఇంట్లో నా బొమ్మల కోసం ఒక ప్రత్యేక గది ఉండేది. మేము చెన్నైకి వెళ్లిన తర్వాత అక్కడ మా ఇల్లంతా కలిపినా ఆ గదిలో సగం ఉండేది కాదు. అన్ని కష్టాలు పడి మా నాన్న మిమ్మల్ని పెంచారు’’ అని Ram Pothineni చెప్పాడు.
Read Also: రెండో వన్డేకు కుల్‌దీప్ ఫిక్స్..?

