Mobile Popup Ad
Mobile Popup Ad

ఆర్యవైశ్య అభివృద్ధికి ప్రభుత్వం పూర్తిగా కట్టుబడి ఉంది: మంత్రి వివేక్

కలం, వెబ్ డెస్క్: తెలంగాణలో ఆర్యవైశ్య సమాజ అభివృద్ధికి కాంగ్రెస్ ప్రభుత్వం పూర్తిగా కట్టుబడి ఉందని కార్మిక శాఖ మంత్రి వివేక్ (Minister Vivek) స్పష్టం చేశారు. మంచి సేవాభావం కలిగిన నాయకుడైన లక్ష్మీనారాయణను గెలిపించుకోవడం చాలా గర్వంగా ఉందని చెప్పారు. ఆర్యవైశ్య కార్పొరేషన్‌కు మరిన్ని నిధులు కేటాయించాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కోరతానని చెప్పారు. గతంలో టీ.జీ. వెంకటేష్ మంత్రిగా ఉన్న సమయంలో ఆయనను కలిశానని.. ఆర్యవైశ్య సంఘానికి పెద్ద ఎత్తున నిధులు కేటాయించడం తనకు చాలా సంతోషంగా ఉందని తెలిపారు. ప్రస్తుతం కూడా అనేక మంది వైశ్యులు కాంగ్రెస్ పార్టీకి అండగా నిలుస్తున్నారని హర్షం వ్యక్తం చేశారు.

తమ చెన్నూరు (Chennuru) నియోజకవర్గంలో కూడా వైశ్యుల మద్దతు బలంగా ఉందని చెప్పారు. తెలంగాణ ఉద్యమ సమయంలో నాగరాజు అనే వైశ్యుడు చనిపోయాడని.. ఆయన కుటుంబానికి 15 సంవత్సరాల పాటు పెన్షన్ అందించామని గుర్తు చేశారు. ఇటీవల ప్రారంభించిన ఆర్యవైశ్య వెబ్‌సైట్ ద్వారా సమాజ సభ్యుల వివరాలు నమోదు అవుతున్నాయని తెలిపారు. ఇంకా నమోదు చేయని వారు వెంటనే తమ వివరాలను నమోదు చేసుకోవాలని మంత్రి (Minister Vivek) కోరారు.

Read Also: తెలంగాణలో ఇంటర్ సప్లిమెంటరీ ఫీజు గడువు పొడిగింపు

Follow Us On : WhatsApp

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>