కలం, మెదక్ బ్యూరో: రాష్ట్ర వ్యాప్తంగా ఇందిరమ్మ ఇండ్ల పథకం కొనసాగుతున్న విషయం తెలిసిందే. ఈ పథకంపై మంత్రి వివేక్ (Minister Vivek) కీలక ప్రకటన చేశారు. అర్హులైన పేదలందరికీ ఇందిరమ్మ ఇండ్లు కేటాయిస్తామని హామీ ఇచ్చారు. ఐదేండ్లలో రాష్ట్ర వ్యాప్తంగా 17 లక్షల ఇండ్లు నిర్మించాలని సీఎం రేవంత్ రెడ్డి లక్ష్యంగా పెట్టుకున్నారని మంత్రి వివేక్ వెంకటస్వామి అన్నారు. మెదక్ జిల్లా నర్సాపూర్ మున్సిపాలిటీలో (Narsapur Municipality) నూతనంగా నిర్మించిన ఇందిరమ్మ ఇళ్ల గృహప్రవేశాలను లబ్ధిదారులతో కలిసి మంత్రి ప్రారంభించారు.
బీఆర్ఎస్ పదేండ్లు మోసం చేసింది
బీఆర్ఎస్ పార్టీ డబుల్ బెడ్రూం ఇండ్లు ఇస్తామని చెప్పి ప్రజలను మోసం చేసిందని వివేక్ ఆరోపించారు. ఇందిరాగాంధీ గరీబ్ హఠావో నినాదంతో అసైన్డ్ భూములు పంపిణీ చేయడంతోపాటు పేదలకు ఇల్లు నిర్మించి ఇచ్చిందని చెప్పుకొచ్చారు. కాంగ్రెస్ ప్రభుత్వం 2009లో ఇందిరమ్మ ఇండ్లు నిర్మించుకోవడానికి లబ్ధిదారులకు లక్ష రూపాయలు ఇచ్చేదన్నారు. ప్రస్తుత ప్రజా ప్రభుత్వం ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణానికి తమ ప్రభుత్వం రూ. 5 లక్షలు ఇస్తుందని గుర్తు చేశారు.
ఇందిరమ్మ ఇండ్లు చారిత్రాత్మక నిర్ణయం
కాంగ్రెస్ ప్రభుత్వం ఆరు గ్యారంటీలలో ఒక గ్యారెంటీగా ఇందిరమ్మ ఇల్లు కట్టించాలని చారిత్రాత్మకమైన నిర్ణయం తీసుకున్నదాని కవిత వ్యాఖ్యానించారు. నరసాపూర్ నియోజకవర్గంలో 3500 ఇండ్లు కట్టుకుంటున్నామన్నారు. మొదటిదపాలో ఇందిరమ్మ ఇల్లు రానివారికి వచ్చే సంవత్సరంలో ఇంకొక 2,500 ఇల్లు మంజూరు చేస్తామన్నరు. ఇందిరమ్మ ఇళ్ల విషయంలో నర్సాపూర్ నియోజకవర్గంలో 100 శాతం పూర్తి అయ్యేలా చూడాలని అధికారులకు మంత్రి వివేక్ (Minister Vivek) ఆదేశించారు.
Read Also: రీల్స్ క్రేజ్ : ప్రాణాలు కోల్పోతూ.. ఇతరుల ప్రాణాలు తీస్తున్న యూత్
Follow Us On: Instagram

