కవిత కొత్త పార్టీపై ఎంపీ చామల రియాక్షన్

కలం, వెబ్‌డెస్క్: తెలంగాణ రాష్ట్ర సేన పార్టీ ప్రారంభించిన కవిత (Kavitha) కు ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి (MP Chamala Kiran Kumar Reddy) అభినందనలు తెలిపారు. బీఆర్ఎస్ ప్రభుత్వం 2014 నుంచి 2023 వరకు కడుపు చూసి కాదు జేబులు చూసి పరిపాలించినట్లు కవిత ఒప్పుకోవడాన్ని విమర్శించారు. పదేళ్ల బీఆర్ఎస్ పాలనలో దోచుకోవడం, దాచుకోవడం, పంచుకోవడంలో తేడాలు రావడం వల్లే ఈరోజు కవిత పార్టీ పెట్టారని ఎంపీ ఆరోపించారు. పదేళ్ల కల్వకుంట్ల కుటుంబ పాలనలో ప్రజా సమస్యలు, విద్య, వైద్యం, ఉద్యోగాలు, ఉపాధి, సామాజిక న్యాయం కవితకు ఎందుకు గుర్తుకు రాలేదని ఎంపీ చామల ప్రశ్నించారు. 2016లోనే కవిత పార్టీ పెట్టి తెలంగాణ ప్రజలను జాగృతి చేసి ఉంటే ప్రజలు ఆదరించి ఉండే వారని అన్నారు.

Read Also: క‌విత పార్టీపై తెలంగాణ‌ బీజేపీ చీఫ్ షాకింగ్ కామెంట్స్!

Follow Us On: X(Twitter)

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>