కలం, మెదక్ బ్యూరో : మున్సిపల్ ఎన్నికల (Municipal Elections ) షెడ్యూల్ పై మంత్రి వివేక్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఈనెల 25 లేదా 26న ఎన్నికల షెడ్యూల్ విడుదల అవుతుందని, అలాగే ఫిబ్రవరి 11న మున్సిపల్ ఎన్నికలు ఉండే అవకాశం ఉందని మంత్రి తెలిపారు. మెదక్ జిల్లా నర్సాపూర్ లో కాంగ్రెస్ పార్టీ మున్సిపల్ ఎన్నికల సన్నాహక సమావేశంలో జిల్లా ఇన్ చార్జ్ మంత్రి వివేక్ వెంకటస్వామి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ఎన్నికలకు సిద్ధంగా ఉండాలని, కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధి, సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని సూచించారు. కలిసి కట్టుగా పని చేసి ఉమ్మడి మెదక్ జిల్లా లో మున్సిపాలిటీ లను గెల్చుకోవాలని కార్యకర్తలకు పిలుపునిచ్చారు.


