కలం, హుజూర్ నగర్ : కృష్ణా నదిపై (Krishna River) అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న రాజీవ్ గాంధీ ఎత్తిపోతల పథకం పనులను రాష్ట్ర నీటిపారుదల, ఆహార పౌర సరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి (Minister Uttam Kumar Reddy) శనివారం క్షేత్రస్థాయిలో పరిశీలించారు. చింతలపాలెం మండలం బుగ్గ మాధవరం వద్ద జరుగుతున్న ప్రాజెక్టు పనుల్లో భాగంగా మంత్రి ఉత్తమ్ ముందుగా అండర్ గ్రౌండ్ పంప్ హౌస్ పనులను క్షుణ్ణంగా పరిశీలించి, అధికారులకు పలు సూచనలు చేశారు.
అనంతరం ఏర్పాటు చేసిన సమావేశంలో మంత్రి మాట్లాడుతూ.. రూ.394 కోట్ల అంచనా వ్యయంతో చేపట్టిన ఈ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు ద్వారా మొత్తం 4 మండలాల పరిధిలోని 14,100 ఎకరాలకు సాగునీరు అందుతుందని స్పష్టం చేశారు.
ఈ ప్రాజెక్టు నిర్మాణం కోసం 35 ఎకరాల రైతు భూములను సేకరించామని, ఇందుకుగానూ రైతులకు నష్టపరిహారంగా రూ. 17 కోట్ల 50 లక్షలు చెల్లించినట్లు మంత్రి (Minister Uttam) తెలిపారు. నిర్మాణ పనుల్లో ఎక్కడా నాణ్యత లోపించకూడదన్నారు. ఎటువంటి లోపాలు లేకుండా అంతర్జాతీయ ప్రమాణాలతో, నిర్దేశిత గడువులోగా పనులను పూర్తి చేయాలని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి గుత్తేదారులను (కాంట్రాక్టర్లను) ఆదేశించారు. నిర్లక్ష్యం వహిస్తే కఠిన చర్యలు ఉంటాయని హెచ్చరించారు. ఈ పర్యటనలో జిల్లా కలెక్టర్ తేజస్ నంద్ లాల్ పవార్, జిల్లా ఎస్పీ కె. నరసింహ, ఇరిగేషన్ ఎస్‌సీ నాగభూషణం, డీసీసీ జిల్లా అధ్యక్షులు గుడిపాటి నరసయ్య, వంగవీటి రామారావులతో పాటు స్థానిక సర్పంచులు, ప్రజాప్రతినిధులు, ఉన్నతాధికారులు పాల్గొన్నారు.
Read Also: తల్లి కాబోతున్న సమంత.. బేబీ బంప్ ఫొటోలు వైరల్!
Follow Us On : WhatsApp

