Mobile Popup Ad
Mobile Popup Ad

ఓబీసీల అభ్యున్నతే లక్ష్యంగా కేంద్రం అడుగులు: గంగాడి కృష్ణారెడ్డి

కలం, కరీంనగర్ బ్యూరో: కేంద్ర ప్రభుత్వం గత 12 ఏళ్లుగా పేద, మధ్యతరగతి, బడుగు బలహీన వర్గాల సంక్షేమం కోసం అనేక అద్భుతమైన పథకాలను అమలు చేస్తోందని బీజేపీ జిల్లా అధ్యక్షుడు గంగాడి కృష్ణారెడ్డి (Gangadi Krishna Reddy) కొనియాడారు. ప్రధాని మోదీ 12 ఏళ్ల పాలన పూర్తయిన సందర్భాన్ని పురస్కరించుకొని జన్ కళ్యాణ్ ప్రోగ్రాంలో భాగంగా శనివారం రోజున బీజేపీ ఓబీసీ మోర్చా మానకొండూరు అసెంబ్లీ ఆధ్వర్యంలో కేంద్ర ప్రభుత్వ విశ్వకర్మ యోజన లబ్ధిదారులతో సమావేశం, మేధావులతో సదస్సు నిర్వహించారు. ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా హాజరైన ఆయన మాట్లాడుతూ.. దేశాభివృద్ధిలో ఓబీసీ వర్గాల పాత్రను గుర్తించిన కేంద్రం.. వారి ఆర్థిక, సామాజిక సాధికారత కోసం అనేక ప్రత్యేక కార్యక్రమాలను చేపడుతోందన్నారు.

మోడీ ప్రభుత్వం ప్రవేశపెట్టిన “పీఎం విశ్వకర్మ యోజన” కులవృత్తులకు కొత్త జీవం పోసిందన్నారు. సంప్రదాయ చేతివృత్తులు చేసుకునే విశ్వకర్మ వర్గాల వారికి ఈ పథకం ఒక వరం లాంటిదన్నారు. కులవృత్తుల వారిని ప్రోత్సహించడానికి కేంద్రం రూ. లక్షల కొద్దీ రుణాలను అతి తక్కువ వడ్డీకే అందిస్తోందని తెలిపారు. కేవలం ఆర్థిక సహాయమే కాకుండా, శిక్షణ, ఆధునిక పనిముట్లు, మార్కెటింగ్ సౌకర్యాలను కల్పించడం ద్వారా వృత్తి కళాకారులను స్వయం సమృద్ధివంతులుగా తీర్చిదిద్దే లక్ష్యంగా కార్యక్రమం కొనసాగుతుందన్నారు. ఓబీసీల సాధికారతకు బీజేపీ కట్టుబడి ఉందన్నారు. మోడీ సర్కారు అమలు చేస్తున్న పథకాలు కుల, మతాలకతీతంగా ప్రతి అర్హుడికి అందుతున్నాయని చెప్పారు.

భారత్‌ను ‘వికసిత్ భారత్’గా మార్చే క్రమంలో ఓబీసీల భాగస్వామ్యం కీలకమని, ఆ దిశగా కేంద్రం ఓబీసీ రిజర్వేషన్లు, స్కాలర్‌షిప్‌లు, స్వయం ఉపాధి పథకాలను పటిష్టంగా అమలు చేస్తోందని గుర్తు చేశారు. గత పాలకుల విధానాలకు భిన్నంగా, నేడు ప్రతి రూపాయి నేరుగా లబ్ధిదారుల ఖాతాల్లోకే చేరుతోందని, అవినీతికి ఆస్కారం లేని పారదర్శక పాలనను మోడీ అందిస్తున్నారని ఆయన (Gangadi Krishna Reddy) ఉద్ఘాటించారు.

2047 నాటికి భారత్‌ను విశ్వగురువుగా తీర్చిదిద్దే లక్ష్యంగా 12 ఏళ్ల మోడీ ప్రభుత్వ పాలన కొనసాగిందన్నారు. మోడీ పాలనలో భారత్ ప్రపంచంలోనే నాలుగో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా ఎదిగిందన్నారు. 2047 నాటికి దేశాన్ని అభివృద్ధి చెందిన దేశాల సరసన నిలబెట్టాలనే లక్ష్యంతో ప్రధాని మోడీ నిరంతరం శ్రమిస్తున్నారని, ఆ లక్ష్య సాధనలో ప్రతి కార్యకర్త భాగస్వాములు కావాలని ఆయన పిలుపునిచ్చారు.

ఈ కార్యక్రమంలో బీజేపీ జిల్లా ఉపాధ్యక్షులు, ఓబీసీ మోర్చా జిల్లా ప్రబారి రంగు భాస్కరాచారి, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు ఇనుగొండ నాగేశ్వర్ రెడ్డి, పుప్పాల రఘు, ఓబీసీ మోర్చా రాష్ట్ర కార్యదర్శి అడిచర్ల రాజు, జిల్లా ప్రధాన కార్యదర్శి ఆకుల రాజేందర్, బెజ్జంకి మండల బీజేపీ అధ్యక్షులు కోలిపాక రాజు, అప్పని తిరుపతి, ఎర్రోజు లక్ష్మణ్, ఇంగ్లీ ప్రభాకర్, మార్కొండ రమేష్, ఓబీసీ మోర్చా మండల కన్వీనర్లు దురశేటి రమేష్, నూనె అంజి, అంబటి స్వామి, అంబటి స్వామి గుంటి మహేష్, నూనె అంజి, వంగల ఆంజనేయులు, ఉషా కోయిల రమేష్ అశ్విన్ తేజ, నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

Read Also : గర్భిణీ మృతితో చర్చనీయాంశంగా ప్రభుత్వాసుపత్రులు

Follow Us On : WhatsApp

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>