కలం ,మహబూబ్ నగర్ బ్యూరో : ఆదివారం జరగనున్న నీట్-2026 పరీక్ష ను పకడ్బందీగా నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు చేసినట్లు జిల్లా కలెక్టర్ ఖుష్బూ గుప్తా (Collector Khushboo Gupta) తెలిపారు. నీట్ పరీక్ష నిర్వహణ నేపథ్యంలో మహబూబ్‌నగర్ జిల్లా కలెక్టర్ వీడియో కాన్ఫరెన్స్ హాల్ నందు జిల్లా కలెక్టర్ కుష్బూ గుప్తా, జిల్లా ఎస్.పి డి.జానకి తో కలిసి సంబంధిత శాఖల అధికారులతో శనివారం సమీక్ష సమావేశం నిర్వహించారు. జిల్లా కలెక్టర్ పరీక్షల నిర్వహణలో భాగంగా సంబంధిత శాఖల అధికారులకు పలు కీలక ఆదేశాలు జారీ చేశారు. పరీక్షా కేంద్రాల వద్ద అవసరమైన మౌలిక వసతులు, తాగునీరు, విద్యుత్ సరఫరా, వైద్య సదుపాయాలు, అంబులెన్స్ సేవలు అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకోవాలని సూచించారు.
రవాణా శాఖ అధికారులు విద్యార్థులు సమయానికి పరీక్షా కేంద్రాలకు చేరుకునేలా తగిన రవాణా సౌకర్యాలు కల్పించాలని ఆదేశించారు. జిల్లాలో 13 పరీక్షా కేంద్రాల్లో మొత్తం 4291 మంది విద్యార్థులు పరీక్షలకు హాజరు కానుండగా, విద్యార్థులందరికీ RTC రవాణా శాఖ తరపున ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పించబడినట్లు తెలిపారు. విద్యాశాఖ, రెవెన్యూ, మున్సిపల్, విద్యుత్, వైద్య ఆరోగ్య శాఖలు పరస్పర సమన్వయంతో పనిచేసి పరీక్షల సజావు నిర్వహణకు సహకరించాలని సూచించారు. అలాగే పరీక్షా కేంద్రాల పరిసర ప్రాంతాలలో ప్రశాంత వాతావరణం నెలకొనేలా, ఎటువంటి అంతరాయాలు కలగకుండా అన్ని శాఖల అధికారులు అప్రమత్తంగా ఉండాలని ఆదేశించారు.
ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ గారు మాట్లాడుతూ.. NEET పరీక్షకు హాజరయ్యే విద్యార్థులు పరీక్షా కేంద్రాలకు నిర్ణీత సమయానికి ముందుగానే చేరుకోవాలని సూచించారు. విద్యార్థులు తమ హాల్ టికెట్/అడ్మిట్ కార్డ్‌లో పొందుపరిచిన అన్ని సూచనలు తప్పనిసరిగా చదివి, అందులో పేర్కొన్న నిబంధనలను తూచా తప్పకుండా పాటించాలని తెలిపారు. పరీక్ష మధ్యాహ్నం 2:00 గంటల నుండి సాయంత్రం 5:15 గంటల వరకు నిర్వహించబడుతుందని తెలిపారు. పరీక్ష రోజున ఎటువంటి ఇబ్బందులు ఎదురుకాకుండా అభ్యర్థులు ఒక రోజు ముందుగానే తమ పరీక్షా కేంద్రాన్ని సందర్శించి లొకేషన్ తెలుసుకోవాలని సూచించారు.
పరీక్షా కేంద్రాలలో విద్యార్థులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా అన్ని శాఖల అధికారులు సమన్వయంతో పనిచేయాలని ఆదేశించారు. ముఖ్యంగా పరీక్షా కేంద్రాల పరిసర ప్రాంతాలలో ఉన్న జిరాక్స్ సెంటర్లు, ఇంటర్నెట్ సెంటర్లు, బుక్ స్టాళ్లు/బుక్ సెంటర్లు పరీక్ష సమయాల్లో మూసివేయాలని సంబంధిత అధికారులకు సూచించారు. విద్యార్థులు తప్పనిసరిగా అడ్మిట్ కార్డు / హాల్ టికెట్, చెల్లుబాటు అయ్యే ఒరిజినల్ ఫోటో ఐడీ ప్రూఫ్ వెంట తీసుకురావాలని తెలిపారు. వీటి పరిశీలన లేకుండా ఏ అభ్యర్థినీ పరీక్షా కేంద్రంలోకి అనుమతించరని స్పష్టం చేశారు. NTA వెబ్‌సైట్ నుండి డౌన్‌లోడ్ చేసుకున్న అడ్మిట్ కార్డులో కేటాయించిన స్థలంలో పాస్‌పోర్ట్ సైజ్ ఫోటోను అతికించి తీసుకురావాలని సూచించారు
అభ్యర్థులు పరీక్షా కేంద్రానికి కనీసం 2 గంటల ముందుగానే చేరుకోవాలని తెలిపారు. పరీక్షా కేంద్రాలలో ఉదయం 11:00 గంటల నుండి మధ్యాహ్నం 1:30 గంటల వరకు మాత్రమే ప్రవేశం ఉంటుందని, 1:30 గంటల తర్వాత ఎట్టి పరిస్థితుల్లోనూ ఎవరినీ అనుమతించరని స్పష్టం చేశారు. భ్యర్థులు సాధారణ దుస్తుల్లో రావాలని, ముఖ్యంగా మహిళా అభ్యర్థులు సహా ఎవ్వరూ ఆభరణాలు, మెటల్ వస్తువులు, ఎలక్ట్రానిక్ పరికరాలు ధరించకూడదని తెలిపారు. పరీక్షా కేంద్రాలలో మెటల్ డిటెక్టర్ ద్వారా తనిఖీలు (Frisking ర్వహించబడతాయని చెప్పారు.
పరీక్షా కేంద్రాలలో ప్రవేశ సమయంలో బయోమెట్రిక్ హాజరు నమోదు, ఫేస్ వెరిఫికేషన్, ఫ్రిస్కింగ్ / భద్రతా తనిఖీలు తప్పనిసరిగా నిర్వహించబడతాయని తెలిపారు. అభ్యర్థులు మొబైల్ ఫోన్లు, స్మార్ట్ వాచ్‌లు, బ్లూటూత్ పరికరాలు, ఎలక్ట్రానిక్ గాడ్జెట్లు, పుస్తకాలు, నోట్స్, స్టడీ మెటీరియల్ వంటి నిషేధిత వస్తువులు తీసుకురాకూడదని చెప్పారు. అదేవిధంగా, PwBD (Persons with Benchmark Disabilities) కేటగిరీకి చెందిన అభ్యర్థులు లేదా NTA నిబంధనల ప్రకారం స్రైబ్ (Scribe) సౌకర్యం పొందే అభ్యర్థులకు పరీక్ష సమయానికి అదనంగా 1 గంట సమయం (Compensatory Time) కల్పించబడుతుందని జిల్లా కలెక్టర్ (Collector Khushboo Gupta) తెలిపారు. ఈ సమావేశం లో స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ మధుసూదన్ నాయక్,అసిస్టెంట్ కలెక్టర్ అండర్ ట్రైనీ సాయి శివాని,డి.ఆర్.ఓ. ఏ.నిర్మల, కేంద్రీయ విద్యాలయ ప్రిన్సిపల్, నోడల్ అధికారి సురేందర్ తదితరులు పాల్గొన్నారు.
Read Also: తల్లి కాబోతున్న సమంత.. బేబీ బంప్ ఫొటోలు వైరల్!
Follow Us On: Sharechat

