కలం, వెబ్ డెస్క్: హీరోయిన్ సమంత (Samantha) తల్లి కాబోతుందా.. అంటే తాజాగా వైరల్ అవుతున్న ఫొటోలు చూస్తే అవుననే సమాధానం వస్తోంది. ‘మా ఇంటి బంగారం’ మూవీ సక్సెస్ సెలెబ్రేషన్స్‌లో పాల్గొనేందుకు వచ్చిన సమంత బేబీ బంప్‌తో కనిపించడం, ఆ ఫొటోలు వైరల్ అవడంతో ఫ్యాన్స్ సంబరపడిపోతున్నారు. త్వరలోనే తమ అభిమాన హీరోయిన్ నుంచి శుభవార్త రాబోతుందని ఆనందపడుతున్నారు. కొద్ది రోజులుగా ఆమె తల్లి కాబోతున్నారనే పోస్టులు సోషల్ మీడియాలో తెగ చక్కర్లు కొడుతుండగా.. తాజా ఫొటోలతో అది నిజమేనని తేలిపోయింది. అయితే ఈ విషయాన్ని ఆమె అధికారికంగా ఇంకా ప్రకటించలేదు. సమంత గతేడాది రాజ్ నిడమోరును వివాహం చేసుకున్న విషయం తెలిసిందే. ఇటీవలే ఆమె నటించిన ‘మా ఇంటి బంగారం’ మూవీకి ప్రేక్షకుల నుంచి మంచి స్పందన వస్తుండటంతో సమంత ఆనందం వ్యక్తం చేసింది.

