2 లక్షల ఉద్యోగాలు.. మంత్రి శ్రీధర్​ బాబు కీలక వ్యాఖ్యలు

కలం, కరీంనగర్​ : నిరుద్యోగుల అంశం విషయంలో కేటీఆర్ వ్యాఖ్యలపై మంత్రి శ్రీధర్​ బాబు (Minister Sridhar Babu) కౌంటర్ వేశారు. యువతను కేటీఆర్​ రెచ్చగొడుతున్నారని మండిపడ్డారు. కరీంనగర్​ లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. గ్రూప్ 1 పరీక్షలను బీఆర్​ఎస్​ ఎందుకు సరిగ్గా నిర్వహించలేదో సమాధానం చెప్పాలన్నారు. పదేళ్లు ఉద్యోగాల విషయంలో ఏం చేశారని.. నిరుద్యోగులకు ముందు క్షమాపణ చెప్పాలని కేటీఆర్ ను డిమాండ్​ చేశారు.

కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాతే ఉద్యోగాలు వచ్చాయన్నారు. ఎన్నికలకు ముందు రెండు లక్షల ఉద్యోగాలు ఇస్తామని చెప్పిన మాటకు కట్టుబడి ఉండి వాటిని భర్తీ చేస్తామని మంత్రి స్పష్టం చేశారు. బీఆర్ఎస్​ పదేళ్ల కాలంలో ఎన్ని ఉద్యోగాలు ఇచ్చారో చెప్పాలని అని కేటీఆర్ ని ప్రశ్నించారు. బీఆర్ఎస్​ లాగా నిరుద్యోగ యువత తో తాము ఆటలు ఆడలేదని శ్రీధర్​ బాబు తెలిపారు.

అలాగే, ఎల్​ నినో ప్రభావంపై స్పందించి మంత్రి శ్రీధర్​ బాబు (Sridhar Babu).. కరువు దృష్ట్యా ప్రతి జిల్లా కేంద్రం లో కమాండ్ కంట్రోల్ సెంటర్ ఏర్పాటు చేస్తామని తెలిపారు. ఎలాంటి పరిస్థితి వచ్చినా ఎదుర్కునేందుకు సిద్ధంగా ఉంటామని వెల్లడించారు. ఎల్ నినో ఇలానే ఎక్కువ కాలం కొనసాగితే తాగునీటికి కూడా ఇబ్బందులు తప్పవన్నారు.

అందుకే సాగు నీటి తో పాటుగా , తాగు నీరు అంశంలోనూ జాగ్రత్తలు తీసుకోవాల్సి అవసరం ఉందని స్పష్టం చేశారు. కాళేశ్వరం విషయం లో భేషజాలు ఏమీ లేవన్న శ్రీధర్​ బాబు.. మంచి సలహాలు ప్రతిపక్షాలు ఇచ్చినా తీసుకుంటామని చెప్పారు. ప్రస్తుతం మేడిగడ్డ దగ్గర 16 వేల క్యూసెక్ లు మాత్రమే ఉందన్నారు. వరద వచ్చిన సమాచారంతో బీఆర్ఎస్ రాజకీయం చేసిందని శ్రీధర్​ బాబు ఆరోపించారు.

Read Also: ఎన్నడూ లేని కరువు ఈసారి వచ్చే ఛాన్స్: తుమ్మల

Follow Us On : WhatsApp

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>