ఎన్నడూ లేని కరువు ఈసారి వచ్చే ఛాన్స్: తుమ్మల

కలం, కరీంనగర్ బ్యూరో: ప్రపంచ వ్యాప్తంగా ఎల్ నినో ప్రభావం కనిపిస్తోందని.. ఎన్నడూ లేని కరువు ఈసారి వచ్చే ప్రమాదం ఉందని మంత్రి తుమ్మల నాగేశ్వర రావు (Tummala Nageswara Rao) వ్యాఖ్యానించారు. గతంలో చూడని విధంగా ఈసారి ఎల్ నినో ప్రభావం ఉంటుందని వాతావరణ నిపుణులు చెబుతున్నారని అన్నారు. రాష్ట్ర ప్రజలు భూగర్భ జలాలు కూడా తగ్గిపోయి ఇబ్బందులు ఎదుర్కుంటున్నారని చెప్పారు. ఇలాంటి పరిస్థితిని ఎదుర్కొనేందుకు రాష్ట్రంలో చర్యలు చేపట్టాలని ప్రయత్నం చేస్తున్నామని తెలిపారు.

రైతులు నష్టపోకుండా ఆరు తడి పంటలు వేసేలా ప్రచారం, అవగాహన కార్యక్రమాలు చేస్తామని అన్నారు. ప్రతి వారం ఎల్ నినోపై జిల్లా స్థాయి లో సమీక్ష చేస్తామని స్పష్టం చేశారు. మొదట ప్రాధాన్యతగా మంచి నీరు, సాగు నీరుపై ప్రభుత్వం దృష్టి పెడుతుందని చెప్పుకొచ్చారు. రైతులు కూడా ఈ కరువు కాలంలో పంటలపై జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు.

ఈ సందర్భంగా మంత్రి పొన్నం ప్రభాకర్ మాట్లాడుతూ.. ఎల్ నినోపై రాష్ట్ర ప్రభుత్వం ఎన్ని నిర్ణయాలు తీసుకుంటున్నా ప్రజల సహకారం కావాలని విజ్ఞప్తి చేశారు. ప్రతి పౌరుడు ఈ కరువు సమయంలో సామాజిక బాధ్యత తో సహకరించాలని కోరారు. రైతులు వరికి బదులుగా ఆరుతడి పంటకు వేయాలని కోరుతున్నామని అన్నారు. వర్షాలు సమృద్ధిగా కురిసే అవకాశం లేదని వాతావరణ శాఖ హెచ్చరిస్తోందని చెప్పారు.

Read Also: 2 లక్షల ఉద్యోగాలు.. మంత్రి శ్రీధర్​ బాబు కీలక వ్యాఖ్యలు

Follow Us On : WhatsApp

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>