Mobile Popup Ad
Mobile Popup Ad

గుర్తింపు కోస‌మే రాహుల్‌పై కేటీఆర్‌ విమ‌ర్శ‌లు: మంత్రి సీత‌క్క‌

క‌లం, వెబ్ డెస్క్‌: కేటీఆర్‌ (KTR)ను ఎవరూ గుర్తించడం లేదని, అందుకే రాహుల్ గాంధీ (Rahul Gandhi)పై విమ‌ర్శ‌లు చేయ‌డం అలవాటుగా మార్చుకున్నార‌ని మంత్రి సీత‌క్క (Minister Seethakka) కామెంట్ చేశారు. అసెంబ్లీ ఆవరణలో మంత్రి సీతక్క చిట్ చాట్ నిర్వ‌హించారు. ఈ సంద‌ర్భంగా కేటీఆర్‌పై తీవ్ర విమ‌ర్శ‌లు చేశారు. రాహుల్ గాంధీని తిడితే పెద్ద లీడర్ అవుతానని కేటీఆర్ భావిస్తున్నార‌న్నారు. మహిళలకు ఫ్రీ బస్సు పెడితేనే ఓర్వడం లేద‌ని విమ‌ర్శించారు. బీజేపీ వైఫల్యాల మీద మాట్లాడాలంటే కేటీఆర్‌కు వణుకు పుడుతుంద‌న్నారు.

ఆర్థిక ఇబ్బందులు ఉన్నా ప్ర‌భుత్వం ప్రతి పథకాన్ని సమర్థ‌వంతంగా అమలు చేస్తోంద‌ని సీత‌క్క‌ వెల్ల‌డించారు. పథకాల చట్టబద్ధత గురించి కేటీఆర్ మాట్లాడడం హాస్యాస్పదంగా ఉంద‌న్నారు. కేటీఆర్ ముందు బీఆర్ఎస్ నాయకుల డ్రగ్స్ దందా గురించి మాట్లాడాల‌ని సూచించారు. కేటీఆర్ వారసత్వాన్నే వాళ్ల పార్టీ నాయకులు ఫౌంహౌస్ లలో కొనసాగిస్తున్నార‌ని విమ‌ర్శించారు. డ్రగ్స్ కేసులో పట్టుబడ్డ బీఆర్ఎస్ నేతపై చర్యలు తీసుకోకపోవడంతోనే డ్రగ్స్‌ ప్రోత్సహిస్తున్నార‌న్న విష‌యం అర్థం అవుతుంద‌ని చెప్పారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>