తెలంగాణ తల్లి విగ్రహాన్ని ఆవిష్కరించిన గవర్నర్!

క‌లం, వెబ్ డెస్క్‌: తెలంగాణ అసెంబ్లీ (Telangana Assembly) ప్రాంగణంలో ఏర్పాటు చేసిన తెలంగాణ తల్లి విగ్రహావిష్కరణ మహోత్సవం అత్యంత వైభవంగా జరిగింది. రాష్ట్ర గవర్నర్ శివ ప్రతాప్ శుక్లా అసెంబ్లీకి చేరుకోగా సీఎం రేవంత్ రెడ్డి, స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్, మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి ఆయనకు స్వాగతం పలికారు. అనంతరం గవర్నర్, సీఎం, మంత్రులు కలిసి అసెంబ్లీ ఆవరణలోని మహాత్మా గాంధీ, డాక్టర్ బీఆర్ అంబేద్కర్ విగ్రహాలకు పూలమాలలు వేసి నివాళులర్పించారు.

పునరుద్ధరించిన కౌన్సిల్ భవనం ముందు ఏర్పాటు చేసిన తెలంగాణ తల్లి విగ్రహాన్ని గవర్నర్ శివ ప్రతాప్ శుక్లా ఆవిష్కరించారు. డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, రాష్ట్ర మంత్రులు, ఎమ్మెల్యేలు పాల్గొన్నారు. విగ్రహావిష్కరణ అనంతరం ఉభయ సభలను ఉద్దేశించి గవర్నర్ ప్రసంగించనున్నారు. ప్రసంగం ముగిసిన తర్వాత అసెంబ్లీ, మండలి సభ్యులందరూ కలిసి విగ్రహాలకు నివాళులు అర్పించనున్నారు. ఇక బీఆర్ఎస్ స‌భ్యులు ఈ విగ్ర‌హావిష్క‌ర‌ణ కార్య‌క్ర‌మాన్ని బ‌హిష్క‌రించారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>