కలం, వెబ్‌డెస్క్: తెలంగాణ ఫుడ్స్ (Telangana Foods) ద్వారా అంగన్‌వాడీ కేంద్రాలకు సరఫరా చేసే ఆహార పదార్థాల నాణ్యత విషయంలో ఎలాంటి రాజీ పడకూడదని మంత్రి సీతక్క (Seethakka) స్పష్టం చేశారు. తెలంగాణ ఫుడ్స్ విభాగం లోపాలపై సచివాలయంలో నిర్వహించిన సమీక్షా సమావేశంలో ఆమె మాట్లాడారు. తెలంగాణ ఫుడ్స్‌కు సరఫరా చేస్తున్న సరుకుల్లో నాణ్యత లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు.
అంగన్‌వాడీ వ్యవస్థ దాదాపు 50 సంవత్సరాల క్రితం 1975 లో ప్రారంభమైందని గుర్తుచేశారు. పేదల కడుపు తడిమి చూసే తల్లిగా పేరుగాంచిన అప్పటి ప్రధాని ఇందిరాగాంధీ చేతుల మీదుగా ఈ వ్యవస్థ ప్రారంభమైందని తెలిపారు. అంగన్‌వాడీ సెంటర్లకు టీజీ ఫుడ్స్ ద్వారా సరుకుల సప్లై జరుగుతుందని పేర్కొన్నారు. కాబట్టి చిన్నారులకు, గర్బిణీ స్త్రీలకు అందించే ఆహార విషయంలో తప్పనిసరిగా నాణ్యత ప్రమాణాలు పాటించాలని మంత్రి (Seethakka) అధికారులను ఆదేశించారు.
Read Also: పశ్చిమ బెంగాల్ కొత్త సీఎంగా సువేందు అధికారి
Follow Us On: WhatsApp

