అమరావతిలో సంబరాలు.. కార్యకర్తలతో మంత్రి సవిత డాన్స్

కలం, వెబ్ డెస్క్ : ఆంధ్రప్రదేశ్ శాశ్వత రాజధానిగా అమరావతి(Amaravati) కి చట్టబద్ధ హోదా కల్పించే బిల్లుకు రాజ్యసభ (Rajya Sabha) ఆమోదం లభించడంతో అమరావతిలో ఆనందోత్సాహాలు వెల్లివిరిశాయి. పార్లమెంట్‌లో బిల్లు ఆమోదం పొందిన వెంటనే నగరమంతా పండుగ వాతావరణం నెలకొంది. ఈ సందర్భంగా మంత్రి సవిత కూటమి కార్యకర్తలతో కలిసి సంబరాల్లో పాల్గొన్నారు. టీడీపీ, బీజేపీ, జనసేన జెండాలు పట్టుకొని  కార్యకర్తలు ఉత్సాహంగా నృత్యాలు చేస్తూ తమ ఆనందాన్ని వ్యక్తం చేశారు. మంత్రి సవిత(Minister Savitha) కూడా వారితో కలసి నృత్యం చేస్తూ వేడుకలకు ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు.

అమరావతి వీధుల్లో మహిళలు “జై అమరావతి” అంటూ నినాదాలు చేస్తూ సంబరాల్లో మంత్రి సవిత(Minister Savitha) పాల్గొన్నారు. బిల్లు ఆమోదంతో సంవత్సరాలుగా కొనసాగిన అనిశ్చితికి ముగింపు పలికిందని ప్రజలు హర్షం వ్యక్తం చేశారు. రాజధాని హోదా స్థిరపడటంతో అమరావతి భవిష్యత్తుపై కొత్త ఆశలు చిగురిస్తున్నాయని స్థానికులు అభిప్రాయపడుతున్నారు. ఈ నిర్ణయం రాష్ట్ర అభివృద్ధికి కీలక మైలురాయిగా నిలుస్తుందని వారు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.

Read Also: పార్ల‌మెంట్‌లో 11 పార్టీలు మాట్లాడాయి.. వైసీపీపై లోకేశ్ సెటైర్లు!

Follow Us On : WhatsApp

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>