2027 నాటికి పోలవరం ప్రాజెక్టు పూర్తి చేస్తాం: మంత్రి నిమ్మల

కలం, వెబ్ డెస్క్ : పోలవరం ప్రాజెక్టు (Polavaram Project) నిర్మాణంలో అత్యంత కీలకమైన డయాఫ్రం వాల్‌ నిర్మాణం పూర్తయిందని జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు (Nimmala Rama Naidu) అన్నారు. గత ప్రభుత్వం నిర్వాకంతో డయాఫ్రం వాల్‌ దెబ్బతిని, రూ.440 కోట్ల మేర ప్రజాధనం వృథా అయ్యిందన్నారు. కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత నిపుణుల సూచనలతో మరో రూ.1000 కోట్లతో మరో డయాఫ్రం వాల్‌ నిర్మించామని వెల్లడించారు. రికార్డు స్థాయిలో 440 రోజుల్లో 1,372 మీటర్ల పొడవైన కొత్త డయాఫ్రం వాల్‌ ను నిర్మించామని వివరించారు. అంతేకాదు ఇదే స్పీడ్ తో 2027 నాటికి పోలవరం పూర్తి చేస్తామని మంత్రి చెప్పుకొచ్చారు.

ప్రాజెక్టు నిర్మాణంతో పాటు నిర్వాసితుల సంక్షేమానికి కూటమి ప్రభుత్వం పెద్దపీట వేస్తోందని మంత్రి నిమ్మల (Nimmala Rama Naidu) అన్నారు. 2016లో నాటి తెలుగుదేశం ప్రభుత్వ హయాంలోనే చంద్రబాబు నాయుడు నిర్వాసితులకు రూ. 700 కోట్ల పరిహారం అందించారని గుర్తు చేశారు. ప్రస్తుత కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన కేవలం 21 నెలల్లోనే మూడు విడతలుగా రూ. 1,943 కోట్ల భారీ పరిహారాన్ని పంపిణీ చేసినట్లు పేర్కొన్నారు. నిర్వాసితుల ఇంటి నిర్మాణానికి రూ. 3.5 లక్షలు, ఇంటి స్థలం కోసం రూ. 2 లక్షల చొప్పున ప్రభుత్వం ఆర్థిక సాయం అందిస్తోందని, వారి సమస్యల తక్షణ పరిష్కారం కోసం ప్రత్యేకంగా ‘గ్రీవెన్స్ సెల్’ ఏర్పాటు చేసినట్లు తెలిపారు.

Read Also: పార్ల‌మెంట్‌లో 11 పార్టీలు మాట్లాడాయి.. వైసీపీపై లోకేశ్ సెటైర్లు!

Follow Us On: Facebook

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>