Mobile Popup Ad
Mobile Popup Ad

పార్ల‌మెంట్‌లో 11 పార్టీలు మాట్లాడాయి.. వైసీపీపై లోకేశ్ సెటైర్లు!

క‌లం, వెబ్ డెస్క్‌: అమ‌రావ‌తి (Amaravati)చ‌ట్ట‌బ‌ద్ధ‌త బిల్లుకు ఆమోదం, పార్ల‌మెంట్‌లో జ‌రిగిన చ‌ర్చ గురించి మంత్రి నారా లోకేశ్ (Nara Lokesh) ఢిల్లీలో మీడియాతో మాట్లాడారు. ఈ సంద‌ర్భంగా వైసీపీపై సెటైర్లు వేశారు. పార్ల‌మెంట్‌లో అన్ని పార్టీలు క‌లిసిక‌ట్టుగా అమ‌రావ‌తి బిల్లుకు మ‌ద్ద‌తు తెలిపాయ‌ని లోకేశ్ పేర్కొన్నారు. ఒక్క పార్టీ మిన‌హా.. టీమ్ ఎలెవెన్ పార్టీ త‌ప్ప అన్ని పార్టీలు అనుకూలంగా వ్య‌వ‌హ‌రించాయ‌ని చెప్పారు. బీజేపీ, జ‌న‌సేన, జేడీయూ, కాంగ్రెస్‌, టీఎంసీ, ఆప్‌.. అన్ని పార్టీలు ముక్త కంఠంతో ఆంధ్ర రాష్ట్రానికి అమ‌రావ‌తే ఏకైక రాజ‌ధాని అని స్ప‌ష్టం చేశాయ‌న్నారు.

త‌మ‌కు వ‌చ్చిన స‌మాచారం ప్ర‌కారం పార్ల‌మెంట్‌లో 11 పార్టీలు మాట్లాడాయ‌ని వెల్ల‌డించారు. గ‌త పాల‌కులు చేసిన పొర‌పాట్ల వ‌ల్ల ఆ 11 నెంబ‌ర్ త‌మ‌ను వెంటాడుతోంద‌ని వ్యాఖ్యానించారు. ఈ రోజు కూడా యాదృచ్ఛికంగా 11 పార్టీలు మాట్లాడాయ‌ని, ఒక్క పార్టీ వాకౌట్ చేసింద‌ని చెప్పారు. వాకౌట్ చేయ‌డం వాళ్ల‌కు ఫ్యాష‌న్ అని లోకేశ్ (Nara Lokesh) విమ‌ర్శించారు.

Read Also: కేసీఆర్ కాళ్లు ప‌ట్టుకొనైనా నీ అంతు చూస్తా.. అధికారికి పేర్ని నాని వార్నింగ్‌!

Follow Us On: Instagram

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>