కేసీఆర్ కాళ్లు ప‌ట్టుకొనైనా నీ అంతు చూస్తా.. అధికారికి పేర్ని నాని వార్నింగ్‌!

క‌లం, వెబ్ డెస్క్‌: మ‌చిలీప‌ట్నం (Machilipatnam)లో ఆరో వార్డులో ఇండ్ల‌ కూల్చివేత‌ల‌పై మాజీ మంత్రి పేర్ని నాని (Perni Nani) ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. అధికారులు, పోలీసుల తీరుపై తీవ్ర స్థాయిలో మండిప‌డ్డారు. ఇండ్లు కోల్పోయిన బాధితుల‌ను నేడు పేర్ని నాని ప‌రామ‌ర్శించారు. ఈ సంద‌ర్భంగా అధికారుల‌కు మాస్ వార్నింగ్ ఇచ్చారు. మంత్రి కొల్లు ర‌వీంద్ర, అధికారులు కుమ్మ‌రులు, తూర్పు కాపుల గుండెల్లో జేసీబీల‌తో గున‌పాలు దింపార‌ని వ్యాఖ్యానించారు. వారికి త‌గిన గుణ‌పాఠం చెప్తామ‌ని హెచ్చ‌రించారు. 2029లో వైసీపీ ప్ర‌భుత్వం అధికారంలోకి రాగానే ఇదే క‌మిష‌న‌ర్‌ బాపిరాజు చౌద‌రిని బంద‌రుకు క‌మిష‌న‌ర్‌గా తీసుకొచ్చి, స్థానికులు ప‌డుతున్న బాధ‌ను అనుభ‌వించేలా చేస్తాన‌న్నారు. త‌న ఇంటిపై జేసీబీ గునపం దిగితే ఎంత బాధ ఉంటుందో తెలిసేలా చేస్తామ‌న్నారు. ఇప్పుడు విధులు నిర్వ‌హిస్తున్న‌ పోలీస్ అధికారుల‌నే రానున్న రోజుల్లో మీ ఇళ్ల‌కు కాప‌లాగా పెట్టి కూలుస్తాన‌ని చెప్పారు. అసిస్టెంట్ కమిషనర్ గోపాలరావు ఎక్క‌డికి పారిపోయినా వ‌దిలిపెట్టేది లేద‌ని స్ప‌ష్టం చేశారు. ఏపీలో ఎక్కడ ఉన్నా సరే.. చివ‌రికి తెలంగాణకు వెళ్లినా స‌రే.. అవసరమైతే కేసీఆర్‌ (KCR) కాళ్లు పట్టుకునైనా నీ ఇంటి సంగతి చూస్తానంటా వార్నింగ్ ఇచ్చారు.

జిల్లా ఎస్పీ నాయుడుకు పేర్ని నాని (Perni Nani) ప్ర‌శ్న‌లు సంధించారు. క‌మిష‌న‌ర్‌ పోలీస్ ప్రొటెక్ష‌న్ అడిగారా? అని ప్ర‌శ్నించారు. మంత్రి కొల్లు ర‌వీంద్ర ఫోన్ చేసి అడ‌గ‌డం కాద‌ని, రాత పూర్వ‌కంగా అడిగారా? అని నిల‌దీశారు. ఎస్పీ ఈ విష‌యాన్ని ఆలోచించుకోవాల‌ని, కొల్లు ర‌వీంద్ర తానా అంటే తందానా అన్న‌ట్లు వ్య‌వ‌హ‌రించ‌డం స‌రికాద‌ని విమ‌ర్శించారు. ఒక వేళ ముందే పోలీస్ ప్రొటెక్ష‌న్ కోసం రాత‌పూర్వ‌కంగా అడిగి ఉంటే దాన్ని మీడియా ముందు పెట్టాల‌ని డిమాండ్ చేశారు.

Read Also: పార్ల‌మెంట్‌లో 11 పార్టీలు మాట్లాడాయి.. వైసీపీపై లోకేశ్ సెటైర్లు!

Follow Us On: Instagram

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>