epaper
Wednesday, February 18, 2026
epaper

హైదరాబాద్ ప్రజలకు గుడ్‌న్యూస్.. ఇందిరమ్మ ఇండ్లపై కీలక ప్రకటన

కలం, వెబ్ డెస్క్: హైదరాబాద్ జిల్లాలో అర్హులైన పేదలందరికీ ఇందిరమ్మ ఇండ్లు అందజేస్తామని మంత్రి పొన్నం ప్రభాకర్ (Ponnam Prabhakar) స్పష్టం చేశారు. బుధవారం సచివాలయంలోని మంత్రి అజారుద్దీన్, ఎంపీ అనిల్ కుమార్ యాదవ్, ఎమ్మెల్యేలతో ఇందిరమ్మ ఇండ్ల (Indiramma Indlu) లబ్ధిదారుల ఎంపిక, రెండు పడకల గదుల ఇండ్లపై మంత్రి పొన్నం సమీక్షించారు. ఈ సందర్భంగా మంత్రి పొన్నం మాట్లాడుతూ ప్రభుత్వం పేదల ఇండ్ల మంజూరీలో పారదర్శకంగా వ్యవహరిస్తుందని, అర్హులైన ప్రతిఒక్కరికి ఇందిరమ్మ ఇండ్లు నిర్మించి అందించటమే లక్ష్యమని స్పష్టం చేశారు. ఎల్ వన్ (L1) కింద 4800 మంది అర్హులైన ఇండ్ల స్థలాలు ఉన్న పేదలకు రెండు పడకల గదుల ఇండ్ల నిర్మాణం కోసం నిధులు మంజూరు చేస్తామని పేర్కొన్నారు.

అలాగే ఎల్ టు (L2) కింద హైదరాబాద్ జిల్లాలో నాలుగు లక్షల ఇరవై రెండు వేలకు పైగా దరఖాస్తులు అందాయని మంత్రి వివరించారు. హైదరాబాద్ మహానగరంలో స్థలాలు సేకరించి ఇందిరమ్మ ఇండ్లు (Indiramma Indlu) చేపట్టే ఆలోచనలో ప్రభుత్వం ఉందని మంత్రి వివరించారు. పెండింగ్‌లో ఉన్న 2bhk పనులు పూర్తి చేసి అర్హులకు అందించాలని అధికారులకు సూచించారు. ఎక్కడెక్కడ ఖాళీలు ఉన్నాయి? లబ్ధిదారులు ఎంత మంది? లాంటి వివరాలు అధికారులను అడిగి తెలుసుకున్నారు. ఇప్పటికే పలు ప్రాంతాల్లో 2bhk లబ్ధిదారులకు అందించమని, పెండింగ్ పనులు పూర్తి చేసి లబ్ధిదారులకు అందించేలా చర్యలు తీసుకోవాలని మంత్రి పొన్నం ప్రభాకర్ ఆదేశించారు.

మురికివాడ‌ల్లో ఇందిర‌మ్మ మోడ‌ల్ కాల‌నీలు, ఇందిర‌మ్మ ఇండ్ల నిర్మాణానికి స్థలాల సేక‌ర‌ణ‌, అసంపూర్తి డ‌బుల్ బెడ్ రూం నిర్మాణాలు, పూర్తైన ఇండ్ల కేటాయింపు అంశాల‌పై సమీక్షించారు. హైదరాబాద్ (Hyderabad)  జిల్లా పరిధిలోని నియోజకవర్గాల ఎమ్మెల్యేల అభిప్రాయాలను స్వీకరించి చేపట్టే అంశాలపై చర్చించారు.

 Read Also: ధ‌ర‌ణి దోపిడీపై పొంగులేటి ఉక్కుపాదం.. అధికారులకు కీలక ఆదేశాలు

Follow Us On : WhatsApp

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>