Mobile Popup Ad
Mobile Popup Ad

ప్రతిపక్షంలో ఉన్నా ఆదరించారు.. నమ్మకంగా పని చేయండి

కలం, మెదక్ బ్యూరో: ప్రతిపక్షంలో ఉన్నప్పటికి ప్రజలు ఎంతో నమ్మకంతో పటాన్ చెరులో (Patancheru) బీఆర్ఎస్ (BRS) పార్టీకి పట్టం కట్టారని.. వారి నమ్మకాన్ని వమ్ము చేయకుండా మున్సిపాలిటీలను అభివృద్ధి చేయాలని పటాన్ చెరు శాసనసభ్యులు గూడెం మహిపాల్ రెడ్డి (Gudem Mahipal Reddy) అన్నారు. గుమ్మడిదల నూతన మున్సిపల్ పాలకవర్గాన్ని అభినందించారు.

ఈ సందర్భంగా మాట్లాడుతూ ప్రజాస్వామ్యంలో ప్రజా ప్రతినిధుల పాత్ర అత్యంత కీలకమని, ప్రజలకు ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటూ వారి సమస్యల పరిష్కారానికి చిత్తశుద్ధితో కృషి చేయాలని కోరారు. ప్రభుత్వం అందించే నిధులతోపాటు సిఎస్ఆర్ (CSR) నిధులు కేటాయించి అభివృద్ధిని పరుగులు పెట్టిద్దామని కోరారు. అర్హులైన ప్రతి ఒక్కరికి సంక్షేమ పథకాలు అందించాల్సిన బాధ్యత మీపై ఉందని మహిపాల్ రెడ్డి (Gudem Mahipal Reddy) అన్నారు. ఈ సందర్భంగా గుమ్మడిదల మున్సిపల్ చైర్మన్ కుమార్ గౌడ్, వైస్ చైర్మన్ సంధ్య గోవర్ధన్ రెడ్డి, కౌన్సిలర్లు, సీనియర్ నాయకులు, తదితరులు పాల్గొన్నారు.

 Read Also: అది అత్యాచారయత్నమే : సుప్రీం కోర్టు

Follow Us On: Instagram

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>