పోచారం కామెంట్స్‌పై మంత్రి పొన్నం రియాక్షన్

కలం, వెబ్ డెస్క్: సీనియర్ నాయకుడు, బాన్సువాడ ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్ రెడ్డి (Pocharam Srinivas Reddy) సిద్దాపూర్ రిజర్వాయర్ వద్ద భైఠాయించిన విషయం తెలిసిందే. ప్రభుత్వం నిధులు కేటాయించాలని డిమాండ్ చేస్తూ సీఎం రేవంత్‌తో సహా మంత్రులు తన ఫోన్ లిఫ్ట్ చేయడం లేదని ఆయన ఆరోపించారు. ఈ నేపథ్యంలో మంత్రి మంత్రి పొన్నం ప్రభాకర్ (Ponnam Prabhakar) పోచారం వ్యాఖ్యలపై రియాక్ట్ అయ్యారు. ‘పోచారం శ్రీనివాస్ రెడ్డి నాకు ఫోన్ చేయలేదు. ఒకవేళ చేస్తే కచ్చితంగా లిఫ్ట్ చేస్తా. పోచారం నాకు ఫోన్ చేయలేదని ఆయనకు కూడా తెలుసు’ అని పొన్నం ప్రభాకర్ అన్నారు. ప్రస్తుతం పోచారం వ్యాఖ్యలు రాజకీయవర్గాల్లో తీవ్ర చర్చనీయాంశమవుతున్నాయి.

Read Also: రాష్ట్ర ఆర్ధిక పరిస్థితిని పోచారం అర్థం చేసుకోవాలి: మహేశ్ కుమార్ గౌడ్

Follow Us On : WhatsApp

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>